ys jagan mohan reddy
Ys Jagan : ఏపీలో ఇటీవల కాలంలో పెట్టుబడులు ఏమీ రాలేదు అనేది విపక్ష పార్టీల ఆరోపణలు. కొన్ని కారణాల వల్ల ఏపీలో ఇటీవల కాలంలో పెట్టుబడులు రాని మాట వాస్తవమే. కాని ఇకపై వరుసగా ఏపీలో పెట్టుబడులు వస్తాయని వైకాపా నాయకులు మరియు మంత్రులు అంటున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం తో కొత్తగా ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు విదేశీయులు ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ముఖ్యంగా ఎన్నారైలు రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు వస్తారని ఆశిస్తున్నారు. విదేశాల్లో ఉన్న ఇండియన్స్ పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నా కూడా ఏపీలో ఉన్న పరిస్థతుల కారణంగా 2019 తర్వాత వారు ముందుకు రావడం లేదు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు వచ్చే వారి కోసం పన్ను రాయితీని కూడా జగన్ ప్రకటించారు అంటూ వైకాపా నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
విదేశీ పెట్టుబడులు ఆకర్షించేందుకు కొత్త పాలసీని ప్రవేశ పెట్టేందుకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారట. త్వరలో శాసన సభ సమావేశాల్లో ఈ కొత్త నిర్ణయాన్ని ప్రకటిస్తారని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న పాలసీల కారణంగా రాష్ట్రంలో పెట్టుబడులు రావడం లేదు.
ys jagan mohan reddy
దాంతో విదేశీయుల కు పెద్ద మొత్తంలో పన్ను రాయితీలను ఇవ్వాలని నిర్ణయించారట. అందుకు సంబంధించిన నిర్ణయాన్ని ఇప్పటికే తీసుకున్నారని తెలుస్తోంది. పెట్టుబడులు లేక పోవడం వల్ల ఉద్యోగాలు లేవు మరియు ప్రభుత్వ ఆదాయం తగ్గింది. అందుకే సీఎం జగన్ మోహన్ రెడ్డి కొత్త పాలసీలను తీసుకు వచ్చి విదేశీ పెట్టుబడులకు రెడ్ కార్పేట్ ను పర్చబోతున్నారు.
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ది మరియు అమలు అవుతున్న పథకాల కారణంగా పెట్టుబడులకు స్వర్ఘ దామంగా రాష్ట్రం నిలిచిందంటూ వైకాపా నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రస్తుతం అందుకు సంబంధించిన అధికారుల కొత్త పారిశ్రామకి పాలసీలను తయారు చేస్తున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పెద్ద మొత్తంలో రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు గాను తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగు దేశం పార్టీ చేస్తున్న ఆరోపణలను తిప్పి కొట్టేందుకు గాను ఈ నిర్ణయం తీసుకున్నారు.
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
కూకట్ పల్లి (Kukatpally) బాలిక సహస్ర హత్య కేసు (Sahasra Case) దర్యాప్తులో షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
This website uses cookies.