Ys Jagan : జ‌గ‌న్ నిర్ణ‌యంతో ఏపీలో పెట్టుబడులకు NRI క్యూ కట్టడం ఖాయం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ys Jagan : జ‌గ‌న్ నిర్ణ‌యంతో ఏపీలో పెట్టుబడులకు NRI క్యూ కట్టడం ఖాయం

 Authored By himanshi | The Telugu News | Updated on :5 April 2021,5:45 pm

Ys Jagan : ఏపీలో ఇటీవల కాలంలో పెట్టుబడులు ఏమీ రాలేదు అనేది విపక్ష పార్టీల ఆరోపణలు. కొన్ని కారణాల వల్ల ఏపీలో ఇటీవల కాలంలో పెట్టుబడులు రాని మాట వాస్తవమే. కాని ఇకపై వరుసగా ఏపీలో పెట్టుబడులు వస్తాయని వైకాపా నాయకులు మరియు మంత్రులు అంటున్నారు. సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి తీసుకున్న నిర్ణయం తో కొత్తగా ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు విదేశీయులు ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ముఖ్యంగా ఎన్నారైలు రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు వస్తారని ఆశిస్తున్నారు. విదేశాల్లో ఉన్న ఇండియన్స్‌ పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నా కూడా ఏపీలో ఉన్న పరిస్థతుల కారణంగా 2019 తర్వాత వారు ముందుకు రావడం లేదు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు వచ్చే వారి కోసం పన్ను రాయితీని కూడా జగన్‌ ప్రకటించారు అంటూ వైకాపా నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Ys Jagan : పెద్ద మొత్తంలో పన్ను రాయితీ…

విదేశీ పెట్టుబడులు ఆకర్షించేందుకు కొత్త పాలసీని ప్రవేశ పెట్టేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్లాన్‌ చేస్తున్నారట. త్వరలో శాసన సభ సమావేశాల్లో ఈ కొత్త నిర్ణయాన్ని ప్రకటిస్తారని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న పాలసీల కారణంగా రాష్ట్రంలో పెట్టుబడులు రావడం లేదు.

ys jagan mohan reddy

ys jagan mohan reddy

దాంతో విదేశీయుల కు పెద్ద మొత్తంలో పన్ను రాయితీలను ఇవ్వాలని నిర్ణయించారట. అందుకు సంబంధించిన నిర్ణయాన్ని ఇప్పటికే తీసుకున్నారని తెలుస్తోంది. పెట్టుబడులు లేక పోవడం వల్ల ఉద్యోగాలు లేవు మరియు ప్రభుత్వ ఆదాయం తగ్గింది. అందుకే సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి కొత్త పాలసీలను తీసుకు వచ్చి విదేశీ పెట్టుబడులకు రెడ్‌ కార్పేట్‌ ను పర్చబోతున్నారు.

Ys Jagan : పెట్టుబడులకు స్వర్ఘ దామంగా…

రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ది మరియు అమలు అవుతున్న పథకాల కారణంగా పెట్టుబడులకు స్వర్ఘ దామంగా రాష్ట్రం నిలిచిందంటూ వైకాపా నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు ప్రస్తుతం అందుకు సంబంధించిన అధికారుల కొత్త పారిశ్రామకి పాలసీలను తయారు చేస్తున్నారు. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పెద్ద మొత్తంలో రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు గాను తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగు దేశం పార్టీ చేస్తున్న ఆరోపణలను తిప్పి కొట్టేందుకు గాను ఈ నిర్ణయం తీసుకున్నారు.

himanshi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది