Ys Jagan : దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ లో భాగంగా కేసుల సంఖ్య ఆందోళనకర రీతిలో పెరిగింది. రెండు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో జనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు సౌత్ లో ముఖ్యంగా ఏపీ మరియు తెలంగాణలో కేసుల సంఖ్య తక్కువగానే ఉంది. కాని ఇటీవల కేసుల సంఖ్య ఇక్కడ కూడా భారీగా పెరుగుతున్నాయి. దాంతో ఏపీలో వ్యాక్సినేషన్ కు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. వ్యాక్సిన్ కు ఫుల్ డిమాండ్ ఉంది. కాని ఏపీలో వ్యాక్స్ నిల్వలు నిండుకున్నాయి. గత రెండు మూడు రోజులుగా కేంద్రంతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చర్చలు జరుపుతూ చివరకు వ్యాక్సిన్ ను తెప్పించాడు.
ఏపీకి కేంద్ర ప్రభుత్వం 5 లక్షల డోసులను ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఈ అయిదు లక్షల డోసులను వెంటనే పంపిణీ చేసేందుకు గాను ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. కరోనా విజృంభించకుండా ఉండేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్న ఏపీ ప్రభుత్వం యుద్ద ప్రాతిపధికన వైరస్ నివారణకు వ్యాక్సిన్ ఇవ్వాలని భావిస్తున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలంటూ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వ్యాక్సిన్ వినియోగించడం వల్ల కరోనా కేసుల సంఖ్య తగ్గడంతో పాటు కరోనా వ్యాప్తిని అరికట్ట వచ్చు అంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అబిప్రాయం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ వేయడం ద్వారానే ఈ విపత్తు నుండి బయట పడవచ్చు అంటూ కేంద్రం కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్న విషయం తెల్సిందే.
ఏపీలో ఇప్పటికే భారీ ఎత్తున వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. రాబోయే రెండు మూడు రోజుల్లో మరో 5 లక్షల మందికి వ్యాక్సిన్ ను ఇవ్వబోతున్నారు. కనుక ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలంటూ నిపుణులు చెబుతున్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలంటూ ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది. కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నా కూడా కరోనా ప్రభావం నుండి కాస్త అయినా ఉపశమనం పొందవచ్చు అనేది నిపుణులు చెబుతున్న మాట. ప్రాణాపాయం తప్పించడం లేదా వైరస్ ను దూరంగా ఉంచడంలో వ్యాక్సిన్ కీలకంగా పని చేస్తుంది. అందుకే అయిదు లక్షల డోసులు రావడం అనేది ఏపీ ప్రజలకు శుభవార్తే అంటున్నారు.
Winter Season : చలికాలం వచ్చేసింది. అయితే ఈ కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలలో నిద్రమత్తు కూడా ఒకటి. ఈ…
Hair Care : ప్రస్తుత కాలంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలలో తెల్ల జుట్టు కూడా ఒకటి. అయితే జుట్టు తెల్లబడడం అనేది…
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
This website uses cookies.