Home » Entertainment » Prabhas Fans Are Angry Regarding Radhae Shyam Delay
Entertainment

Prabhas : ప్రభాస్ ఫ్యాన్స్‌లో మంట చల్లారేదెప్పుడు ..!

Authored By
vamana sai
The Telugu News | Published on: April 17, 2021, 12:10 pm
Advertisement

Prabhas : ప్రభాస్ ఫ్యాన్‌కి ఒక షాకింగ్ న్యూస్ వినిపిస్తోంది. అదేమిటంటే ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం రాధేశ్యామ్. ఈ సినిమాకి రాధకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. యూవి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్, ప్రసీద దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. గోపీకృష్ణ మూవీస్, టీ సిరీస్ భూషన్ కుమార్ సమర్పిస్తున్నారు. ప్రభాస్ కెరీర్ లో నటిస్తున్న ఫస్ట్ పీరియాడికల్ సినిమా. అదీకాక దాదాపు 10 ఏళ్ళ తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న ఫ్యూర్ రొమాంటిక్ లవ్ స్టోరి. ఇక ఈ సినిమాలో మోస్ట్ వాటెండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.

Advertisement

prabhas-fans are angry regarding radhae shyam delay

అయితే ఈ సినిమాని జూలై 30న ప్రపంచ వ్యాప్తంగా నాలుగు భాషల్లో రిలీజ్ చేయబోతున్నట్టు ఇప్పటికే మేకర్స్ అధికారకంగా ప్రకటించారు. కానీ ఇప్పుడు అనుకున్న డేట్ కి రాధేశ్యామ్ రిలీజాయ్యే అవకాశాలేవీ కనిపించడం లేదని తెలుస్తోంది. ఈ పాటికి నెమ్మదిగా ప్రమోషన్స్ మొదలవ్వాల్సింది. కానీ మేకర్స్ ఇంకా సైలెంట్ గానే ఉన్నారు. అందుకు కారణం ఇంకా కాస్త షూటింగ్ బ్యాలెన్స్ ఉందట. ప్రస్తుతం ఈ న్యూస్ తో ప్రభాస్ ఫ్యాన్స్ అగ్గి మీద గుగ్గిలమవుతున్నారట.

Advertisement

Prabhas : రాధేశ్యామ్ చిత్రీకరణ మిగిలి ఉందన్న న్యూస్ ప్రతీ ఒక్కరికి షాక్ కొట్టినట్టు అయిందట.

ఈ సినిమా పీరియాడికల్ సినిమా కాబట్టి వీఎఫ్ ఎక్స్ కి చాలా సమయం పడుతుంది. ఒకవైపు ఆ వర్క్ కూడా పెండింగ్ ఉందట. ఈ సమయంలో ఇంకా రాధేశ్యామ్ చిత్రీకరణ మిగిలి ఉందన్న న్యూస్ ప్రతీ ఒక్కరికి షాక్ కొట్టినట్టు అయిందట. మరి ఇది ఎంతవరకు నిజమన్నది తెలీదు గాని ప్రస్తుతం ఈ విషయం మాత్రం హాట్ టాపిక్‌గా మారింది. చూడాలి మరి రాధేశ్యామ్ అనుకున్న సమయానికి రిలీజ్ అవుతుందా లేదా. కాగా ప్రభాస్ నటిస్తున్న సలార్, ఆది పురుష్ సినిమాలు ప్రస్తుతం సెట్స్ మీద ఉన్నాయి. ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి