YS Jagan : పేద విద్యార్థులకు సీఎం జగన్ గుడ్ న్యూస్.. 25 శాతం సీట్లు పేదలకే.. ఆ స్కూళ్లలో కూడా | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

YS Jagan : పేద విద్యార్థులకు సీఎం జగన్ గుడ్ న్యూస్.. 25 శాతం సీట్లు పేదలకే.. ఆ స్కూళ్లలో కూడా

YS Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ ఏపీలో తీసుకొచ్చిన ప్రభుత్వ పథకాలు మరే రాష్ట్రంలో లేవు. సీఎంగా ఆయన బాధ్యతలు తీసుకున్నాక ఏపీలో విద్య, వైద్యం మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. విద్య వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉంటే ఆ రాష్ట్రం కూడా అంత బాగా డెవలప్ అవుతుందని నమ్మే వ్యక్తి వైఎస్ జగన్. అందుకే.. ఆయన విద్య మీద ఎక్కువ ఫోకస్ పెట్టి నాడు నేడు పేరుతో పలు విద్యకి సంబంధించిన పథకాలను […]

 Authored By kranthi | The Telugu News | Updated on :28 February 2023,3:30 pm

YS Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ ఏపీలో తీసుకొచ్చిన ప్రభుత్వ పథకాలు మరే రాష్ట్రంలో లేవు. సీఎంగా ఆయన బాధ్యతలు తీసుకున్నాక ఏపీలో విద్య, వైద్యం మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. విద్య వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉంటే ఆ రాష్ట్రం కూడా అంత బాగా డెవలప్ అవుతుందని నమ్మే వ్యక్తి వైఎస్ జగన్. అందుకే.. ఆయన విద్య మీద ఎక్కువ ఫోకస్ పెట్టి నాడు నేడు పేరుతో పలు విద్యకి సంబంధించిన పథకాలను తీసుకొచ్చారు. ఆ పథకాలు దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచ గుర్తింపు పొందాయి.

ys jagan good news to students who study in private schools

ys jagan good news to students who study in private schools

విద్య వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసి పేద విద్యార్థులకు కూడా బెస్ట్ ఎడ్యుకేషన్ విధంగా విద్యా వ్యవస్థను రూపొందించారు సీఎం జగన్. తాజాగా ఆయన మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పేద విద్యార్థుల కోసం తీసుకున్న నిర్ణయం ఇది. విద్యా హక్కు చట్టం కింద ఏపీలో ఉన్న ప్రైవేట్ స్కూళ్లలో 25 శాతం సీట్లను పేద విద్యార్థులకు కేటాయించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దానికి సంబంధించిన జీవోను కూడా విడుదల చేసింది ప్రభుత్వం.

Good New to Students: ఏపీలో విద్యార్థులకు మరో శుభవార్త.. ఈ ఏడాది నుంచే అమలు చేయాలని నిర్ణయం– News18 Telugu

YS Jagan : విద్యా హక్కు చట్టం కింద ప్రైవేట్ స్కూళ్లలో 25 శాతం సీట్లు పేదలకే

ప్రైవేట్, అన్ ఎయిడెడ్ స్కూళ్లలో విద్యా హక్కు చట్టం కింద 25 శాతం సీట్లు కేటాయించాలని జగన్ సర్కార్ జీవో జారీ చేసింది. దీనికి సంబంధించి మార్చి 6 నుంచి 18 వరకు స్కూల్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత పేద విద్యార్థులు తమకు నచ్చిన స్కూళ్లలో ఏప్రిల్ 7 వరకు రిజిస్ట్రేషన్ చసుకుంటారు. తొలి విడత కింద విద్యార్థుల ఎంపిక ప్రక్రియ ఏప్రిల్ 13న లాటరీ ద్వారా ఉంటుంది. రెండో విడత ఏప్రిల్ 25న లాటరీ ద్వారా విద్యార్థులను సెలెక్ట్ చేస్తారు. ఈ స్కూళ్లలో చదివే విద్యార్థులకు పట్టణ ప్రాంతాల విద్యార్థులకు రూ.8000, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు రూ.6500, గిరిజన ప్రాంతాల విద్యార్థులకు రూ.5000 లను ప్రభుత్వం చెల్లిస్తుంది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది