
YS Jagan is complaining that the effect of mlc election results is five ministers
YS Jagan : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో అదేవిధంగా అంతకుముందు పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాబట్టలేకపోయింది. ఎక్కువ స్థానాలు గెలిచిన గాని తెలుగుదేశం పార్టీ ఊహించని విధంగా పుంజుకుంది. ముఖ్యంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీకీ అనుకూలంగా ఓటు వేయడం సంచలనం సృష్టించింది. ఇక ఇదే సమయంలో సదరు నలుగురు ఎమ్మెల్యేలను వైసీపీ సస్పెండ్ చేయడం తెలిసిందే. పరిస్థితి ఇలా ఉంటే వచ్చే ఎన్నికలను సీఎం జగన్ చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది.
YS Jagan is complaining that the effect of mlc election results is five ministers
అయినా గాని సొంత పార్టీ నేతలలో ప్రజాప్రతినిధులలో ఏమాత్రం సీరియస్నెస్ లేకపోవడంతో పాటు ప్రత్యర్థి పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం పట్ల జగన్ అంతర్గతంగా చాలా ఆగ్రహంతో ఉన్నట్లు పార్టీలో టాక్ నడుస్తుంది. ఇక ఇదే సమయంలో ప్రత్యర్థిలో ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్న సమయంలో మంత్రులలో చాలామంది కౌంటర్లు ఇవ్వకపోవడం పట్ల కూడా అధినాయకుడు అసహనంగా ఉన్నారట. దీంతో క్యాబినెట్లో ఐదుగురు మంత్రులను పక్కన పెట్టడానికి జగన్ డిసైడ్ అయినట్లు టాక్. పైగా వాళ్లకు కేటాయించిన శాఖలో వాళ్ళ పనితీరు కూడా సరిగ్గా లేకపోవడంతో… మంత్రివర్గ ప్రక్షాళన చేయటానికి
నిర్ణయం తీసుకున్నట్లు దీంతో త్వరలోనే గవర్నర్ తో జగన్ భేటీ కానున్నట్లు సమాచారం. పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు ఆ ఐదుగురు మంత్రుల ప్లేసులోకి ఎమ్మెల్యే కొడాలి నానిని మంత్రిగా తీసుకోవడానికి జగన్ పెద్ద స్కెచ్ వేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఫస్ట్ టైం లో ఎమ్మెల్యే కొడాలి నాని మంత్రిగా వ్యవహరించారు. ఇక రెండోసారి.. మంత్రివర్గ విస్తరణ చేపట్టిన టైంలో కొడాలి నానిని… పక్కన పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు ఐదుగురు మంత్రులను పక్కన పెడుతున్న నేపథ్యంలో కొడాలి నాని తో పాటు పేర్ని నాని మరి కొంతమంది కౌంటర్లు ఇచ్చే పార్టీ వాయిస్.. తోపాటు ప్రభుత్వం చేసే మంచి పనులను తెలియజేసే వారికి అవకాశం కల్పించడానికి సీఎం జగన్ రెడీ అయినట్లు సమాచారం.
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
This website uses cookies.