YS Jagan : ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్ అయిదుగురు మంత్రులని పీకేస్తున్న జగన్..? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

YS Jagan : ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్ అయిదుగురు మంత్రులని పీకేస్తున్న జగన్..?

YS Jagan : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో అదేవిధంగా అంతకుముందు పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాబట్టలేకపోయింది. ఎక్కువ స్థానాలు గెలిచిన గాని తెలుగుదేశం పార్టీ ఊహించని విధంగా పుంజుకుంది. ముఖ్యంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీకీ అనుకూలంగా ఓటు వేయడం సంచలనం సృష్టించింది. ఇక ఇదే సమయంలో సదరు నలుగురు ఎమ్మెల్యేలను వైసీపీ సస్పెండ్ చేయడం తెలిసిందే. పరిస్థితి ఇలా ఉంటే […]

 Authored By sekhar | The Telugu News | Updated on :27 March 2023,4:00 pm

YS Jagan : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో అదేవిధంగా అంతకుముందు పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాబట్టలేకపోయింది. ఎక్కువ స్థానాలు గెలిచిన గాని తెలుగుదేశం పార్టీ ఊహించని విధంగా పుంజుకుంది. ముఖ్యంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీకీ అనుకూలంగా ఓటు వేయడం సంచలనం సృష్టించింది. ఇక ఇదే సమయంలో సదరు నలుగురు ఎమ్మెల్యేలను వైసీపీ సస్పెండ్ చేయడం తెలిసిందే. పరిస్థితి ఇలా ఉంటే వచ్చే ఎన్నికలను సీఎం జగన్ చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది.

YS Jagan is complaining that the effect of mlc election results is five ministers

YS Jagan is complaining that the effect of mlc election results is five ministers

అయినా గాని సొంత పార్టీ నేతలలో ప్రజాప్రతినిధులలో ఏమాత్రం సీరియస్నెస్ లేకపోవడంతో పాటు ప్రత్యర్థి పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం పట్ల జగన్ అంతర్గతంగా చాలా ఆగ్రహంతో ఉన్నట్లు పార్టీలో టాక్ నడుస్తుంది. ఇక ఇదే సమయంలో ప్రత్యర్థిలో ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్న సమయంలో మంత్రులలో చాలామంది కౌంటర్లు ఇవ్వకపోవడం పట్ల కూడా అధినాయకుడు అసహనంగా ఉన్నారట. దీంతో క్యాబినెట్లో ఐదుగురు మంత్రులను పక్కన పెట్టడానికి జగన్ డిసైడ్ అయినట్లు టాక్. పైగా వాళ్లకు కేటాయించిన శాఖలో వాళ్ళ పనితీరు కూడా సరిగ్గా లేకపోవడంతో… మంత్రివర్గ ప్రక్షాళన చేయటానికి

cm jagans comments on three capitals

నిర్ణయం తీసుకున్నట్లు దీంతో త్వరలోనే గవర్నర్ తో జగన్ భేటీ కానున్నట్లు సమాచారం. పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు ఆ ఐదుగురు మంత్రుల ప్లేసులోకి ఎమ్మెల్యే కొడాలి నానిని మంత్రిగా తీసుకోవడానికి జగన్ పెద్ద స్కెచ్ వేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఫస్ట్ టైం లో ఎమ్మెల్యే కొడాలి నాని మంత్రిగా వ్యవహరించారు. ఇక రెండోసారి.. మంత్రివర్గ విస్తరణ చేపట్టిన టైంలో కొడాలి నానిని… పక్కన పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు ఐదుగురు మంత్రులను పక్కన పెడుతున్న నేపథ్యంలో కొడాలి నాని తో పాటు పేర్ని నాని మరి కొంతమంది కౌంటర్లు ఇచ్చే పార్టీ వాయిస్.. తోపాటు ప్రభుత్వం చేసే మంచి పనులను తెలియజేసే వారికి అవకాశం కల్పించడానికి సీఎం జగన్ రెడీ అయినట్లు సమాచారం.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది