Ys Jagan : విశాఖ పై తన ప్రేమను మళ్లీ మళ్లీ చూపుతూనే ఉన్న వైఎస్ జగన్
Ys Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ విశాఖ పై తన యొక్క అభిమానంను మళ్లీ మళ్లీ చూపిస్తూనే ఉన్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ అభివృద్ది కార్యక్రమాలను పర్యవేక్షిస్తూనే ఉన్న సీఎం వైఎస్ జగన్ ఎక్కువగా వైజాగ్ కు వెళ్తూ అక్కడ జరుగుతున్న అభివృద్ది పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. రాష్ట్రంకు రాజధాని అయ్యేంత అర్హత ఉన్న విశాఖ పట్నం ను జగన్ హైదరాబాద్ రేంజ్ లో అభివృద్ది చేయాలనే పట్టుదలతో ఉన్నాడు. అందులో భాగంగానే మళ్లీ మళ్లీ విశాఖ పట్నం పర్యటకు వెళ్తున్నారు. ఇటీవలే విశాఖ వెళ్లిన సీఎం జగన్ మళ్లీ ఈ వారంలోనే వెళ్లేందుకు సిద్దం అయ్యారు.
పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడంతో పాటు స్థానిక పార్టీ నాయకులతో చర్చలు జరుపబోతున్నారు. గత ఎన్నికల సమయంలో వైకాపాకు విశాఖ లో కాస్త దెబ్బ పడింది. అందుకే ఈసారి అలాంటి ఇబ్బంది జరగకూడదు అనే ఉద్దేశ్యంతో అభివృద్ది కార్యక్రమాలను నిర్వహిస్తూ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ రాజధాని కంటే అద్బుతంగా అభివృద్ది చేయడం కోసం జగన్ కంకణం కట్టుకున్నారు. అందుకే ఇప్పటికే వైజాగ్ లో జరిగిన మేయర్ ఎన్నికల్లో వైకాపాకు అక్కడి జనాలు అద్బుతమైన విజయాన్ని ఇచ్చారు.
రాబోయే రోజుల్లో వైజాగ్ లో మరింతగా అభివృద్ది కార్యక్రమాలు జరపాలనే ఉద్దేశ్యంతో జగన్ ఉన్నారు. కొత్త బిల్లు తీసుకు వచ్చి వైజాగ్ ను రాజధానిగా చేసే వరకు జగన్ విశ్రమించేది లేదు అంటూ ప్రతిజ్ఞ చేశారంటూ వైకాపా నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తప్పకుండా వైజాగ్ కు జగన్ వల్ల మంచి రోజులు వచ్చాయి. రాజధానిగా అయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్న విశాఖ పట్నం ను రాధానిగా చేయగల సత్తా ఉన్న నాయకుడు కేవలం జగన్ మాత్రమే అని.. అందుకే ఆయన్ను జనాలు నమ్ముతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.