YS Jagan : జగన్ స్పీడ్ మామూలుగా లేదుగా.. వాళ్లకు నో చాన్స్ అట
YS Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ స్పీడ్ పెంచేశారు. నిజానికి ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది కానీ.. ఎందుకో సీఎం జగన్ ఇప్పటి నుంచే ఎన్నికలపై దృష్టి పెట్టారు. ఓవైపు ప్రభుత్వ పరమైన పనులను చూసుకుంటూనే పార్టీపై దృష్టి పెట్టారు. అందుకే ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచే పక్కాగా ప్లాన్స్ వేస్తున్నారు. సరిగ్గా ఎన్నికల ముందే సంక్షేమ పథకాలను ప్రారంభిస్తే జనాలు ప్రభుత్వాన్ని నమ్ముతారా? అందుకే.. ఇంకా ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉంది కాబట్టి ఇప్పటి నుంచే ఇంకా బెస్ట్ పథకాలను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
అందులో భాగంగానే వైఎస్సార్ కళ్యాణ మస్తు అనే పథకంతో పాటు వైఎస్సార్ షాదీ తోఫా అనే పథకాలను ప్రవేశపెట్టేందుకు సంసిద్ధమవుతున్నారు. అక్టోబర్ 1 నుంచి ఈ పథకాలు ఏపీ వ్యాప్తంగా అమలు కానున్నాయి. నిజానికి గత మూడేళ్లలో వైఎస్ జగన్ చాలా పథకాలను ప్రారంభించారు. ఇప్పుడు ఇంకా స్పీడ్ పెంచబోతున్నారు. 2019 ఎన్నికల ముందు వైసీపీ మేనిఫెస్టోలో ఎలాంటి హామీలు ఇచ్చామో అవన్నీ దాదాపుగా నెరవేర్చామని సీఎం జగన్ ప్రజలకు విన్నవించేందుకు రెడీ అవుతున్నారు. దాదాపు మూడేళ్ల నుంచి సీఎం జగన్ ప్రవేశపెట్టిన పలు పథకాల కోసం సుమారు రూ.1.50 లక్షల కోట్లను ఖర్చు చేశారు. అయినప్పటికీ ఇంకా పలు సంక్షేమ పథకాలను వచ్చే రెండేళ్లలో సీఎం జగన్ ప్రవేశపెట్టనున్నారు.
YS Jagan : మూడేళ్లలో రూ.1.50 లక్షల కోట్లను సంక్షేమ పథకాలకే కేటాయించిన ఏపీ ప్రభుత్వం
ఇదివరకు టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో కొన్నింటికి మెరుగులు దిద్దారు. కొన్ని పాత పథకాలను కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఏపీ ప్రజలు సీఎం జగన్ పై వేలెత్తి చూపకుండా ఉండేందుకు వైఎస్ జగన్ పక్కా ప్లాన్ చేస్తున్నారు. ప్రతిపక్షాలు కూడా నోరెత్తకుండా 2024 లో ఏపీ ప్రజలను తన వైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. ఓవైపు అప్పులు చేస్తూ ఇలా ప్రజలకు డబ్బులు పంచిపెడుతున్నారు అంటూ ఏపీ ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నా.. అవేవీ పట్టించుకోకుండా సీఎం జగన్ ముందుకు వెళ్తున్నారు. తాను అనుకున్నది సాధిస్తున్నారు.