YS Jagan : వైఎస్ఆర్ సీపీ తాజా వ్యూహం.. ఆ ఓట్ల కోసమేనా ఇదంతా.!?
YS Jagan : ఏపీలో ఇప్పటి వరకు మేనిఫెస్టోలో వైసీపీ హామీ ఇచ్చిన అన్ని హామీలను దాదాపు నెరవేర్చినట్టే. సీఎం జగన్.. ముఖ్యంగా ఎన్నికల ముందు ఏపీ ప్రజలకు హామీ ఇచ్చినట్టుగానే దాదాపు అన్ని సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించారు. అయితే.. ముఖ్యమంత్రి అయిన తర్వాత సీఎం జగన్ అమరావతి రాజధానిని కాదని.. ఏపీ అభివృద్ధి కోసం మూడు రాజధానుల అంశాన్ని తెర మీదికి తీసుకొచ్చారు. వైఎస్ జగన్ ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలు నెరవేర్చారు కానీ.. మూడు రాజధానుల అంశం మాత్రం పెండింగ్ లో ఉంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ మళ్లీ గెలవాలంటే.. మూడు రాజధానుల అంశాన్ని ఎన్నికల లోపు కొలిక్కి తీసుకురావాలి. లేదంటే చాలా కష్టం.
అందుకే కనీసం ముందు వైజాగ్ నుంచి పరిపాలన రాజధానిని కొనసాగించాలని వైసీపీ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. అందుకే త్వరలోనే విశాఖ నుంచి పాలన సాగిస్తామని ఉత్తరాంధ్ర మంత్రులు ప్రకటనలు చేస్తున్నారు. కానీ.. మూడు రాజధానుల అంశం ప్రస్తుతం కోర్టులో ఉంది. దీని వల్ల.. ఈ పరిస్థితుల్లో ఎలా ప్రకటనలు చేస్తారు అనే వార్తలు కూడా వస్తున్నాయి. అయితే.. మూడు రాజధానుల అంశంపై కోర్టు తీర్పు ఎప్పుడు వస్తుంది అనేది పక్కన పెడితే.. పాలనను మాత్రం ముందు వైజాగ్ నుంచి స్టార్ట్ చేస్తారు అంటున్నారు. అంటే.. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నమాట. కాకపోతే అధికారికంగా కాకుండా.. అనధికారికంగా వైజాగ్ నుంచి పాలన ప్రారంభం అవుతుంది. అయితే.. చట్టపరంగా ఎదురవుతున్న
YS Jagan : చట్టపరంగా వస్తున్న అడ్డంకులకు కొత్త దారి వెతుకుతున్న సీఎం జగన్
ఈ అడ్డంకులకు సీఎం జగన్ కొత్త దారి వెతుకుతున్నారని.. ఒకవేళ ఎన్నికలు వచ్చే వరకు కూడా ఇంకా.. మూడు రాజధానుల అంశం ఒక కొలిక్కి రాకపోతే ఎన్నికల్లో ప్రజలను ఓట్లు ఎలా అడగాలి అనేదానిపై సీఎం జగన్ మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలుస్తోంది. అందుకే వైసీపీ మంత్రులు వ్యూహాత్మకంగా ప్రకటనలు చేస్తున్నారని అంటున్నారు. అందుకే.. ముందు వైజాగ్ నుంచి పాలన సాగించబోతున్నారని అంటున్నారు. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడే పాలన జరుగుతుంది కాబట్టి.. మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ అక్కడే ఉంటారు కాబట్టి.. ఖచ్చితంగా కొన్ని రోజుల్లోనే వైజాగ్ నుంచి పాలనను సాగిస్తారని అంటున్నారు. చూద్దాం మరి.. వైఎస్ జగన్ ప్లాన్ ఏమేరకు వర్కవుట్ అవుతుందో.