YS Jagan : బద్వేలు ఉప ఎన్నిక ముగిసింది ఇక ఎన్నికల వాతావరణం కొద్ది రోజుల పాటు ఉండబోదు అనుకునేలోపే మళ్లీ ఎన్నికల నగారా మోగింది. అయితే, ఈ నగారా అసెంబ్లీ ఎన్నికలది కాదు. ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీల కోసం జరిగే ఎన్నిక. ఈ మూడు ఎమ్మెల్సీ స్థానాలకుగాను అధికార వైసీపీ నుంచే ఎన్నికవుతారు.బీజేపీ ఏపీ స్టేట్ చీఫ్ సోము వీర్రాజు, వైసీపీకి చెందిన గోవిందరెడ్డి, టీడీపీకి చెందిన షరీఫ్ పదవీ కాలం ముగిసింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోటా కింద మూడు స్థానాలు భర్తీ కానున్నాయి. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్యా బలాన్ని బట్టి వారే ఆ స్థానాలను భర్తీ చేయనున్నారు.
బద్వేలు ఉప ఎన్నిక పూర్తి అయిన నేపథ్యంలో ఎవరెవరిని ఎమ్మెల్సీలుగా వైఎస్ జగన్ నామినేట్ చేయబోతున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నది. వైసీపీ నేత గోవిందరెడ్డిని తిరిగి ఎమ్మెల్సీగా చేసే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. .కాగా, సోమువీర్రాజు, షరీఫ్ స్థానాల్లో ఎవరిని నామినేట్ చేస్తారో అనేది కీలకంగా మారింది. సామాజిక వర్గాలు, జిల్లాల సమీకరణాల దృష్ట్యా బాగా ఆలోచించి ఆల్రెడీ వైఎస్ జగన్ డెసిషన్ తీసుకున్నారని తెలుస్తోంది. ఉభయ గోదావరి జిల్లాలల నుంచి తోట త్రిమూర్తులు, మోషేర్ రాజు పేర్లు వినబడుడుతున్నాయి. విశాఖ, గుంటూరు జిల్లాల నుంచి గోవిందరెడ్డి పేరు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది.
కాగా, కమ్మ సామాజిక వర్గానికి చెందిన మర్రి రాజశేఖర్‌కు అప్పట్లోనే జగన్ ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారని, ఈ నేఫథ్యంలోనే ఈ సారైనా మర్రి రాజశేఖర్ ఎమ్మెల్సీ అవుతారా అని వైసీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. విశాఖ నుంచి వంశీకృష‌్ణ శ్రీనివాస్ పేరు వినబడుతోంది. అయితే, మూడు స్థానాలకుగాను మూడు సామాజిక వర్గాల నుంచి అభ్యర్థులను జగన్ ఫైనల్ చేసినట్లు సమాచారం. కాగా, ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.