YS Jagan : వీడనున్న సస్పెన్స్.. వైఎస్ జగన్ కీలక ప్రకటన..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YS Jagan : వీడనున్న సస్పెన్స్.. వైఎస్ జగన్ కీలక ప్రకటన..?

 Authored By mallesh | The Telugu News | Updated on :10 November 2021,4:10 pm

YS Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి గత కొద్ది రోజుల నుంచి వైసీపీ పార్టీలోని అంతర్గత విషయాలపైన దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. పార్టీలో ఉన్న నేతల్లో ఎవరెవరు అసంతృప్తితో ఉన్నారు? ఎవరికి పదవులు ఇవ్వాలి? అనే విషయాలపై జగన్ క్లియర్‌గా ఒక అండర్ స్టాండింగ్‌కు వచ్చినట్లు వినికిడి.ఏపీలోని మూడు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఎమ్మెల్యే కోటావి కాగా, 11 స్థానిక సంస్థల కోటాలో ఉన్నాయి. కాగా ఈ మొత్తం 14 స్థానాలు అధికారి వైసీపీకి దక్కుతాయని తెలుస్తోండగా, ఎవరెవరి జగన్ అభ్యర్థులుగా ఫైనల్ చేస్తారనేది కీలకాంశంగా మారింది.

YS Jagan

YS Jagan

అయితే, ఎమ్మెల్యే కోటాల భర్తీ కానున్న మూడు ఎమ్మెల్సీ స్థానాలకు నేతలను జగన్ ఆల్రెడీ ఫైనల్ చేసినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఆ ముగ్గురి పేర్లను బుధవారం అనౌన్స్ చేయబోతున్నట్లు సమాచారం. ఇందులో గోవిందారెడ్డి పేరు కంపల్సరీగా ఉంటుందని, ఆయనతో పాటు మరో ఇద్దరు పేర్లుంటాయని తెలుస్తుండగా, వారిరువురు ఎవరు అనేది ప్రజెంట్ సస్పెన్స్‌గా మారింది. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను బుధవారం ప్రకటిస్తారని తెలుస్తోంది. అయితే, ఇందులో ఎంత వరకు నిజముందో తెలియదు. మొత్తం 14 మంది అభ్యర్థుల పేర్లను బుధవారం సాయంత్రం వరకు జగన్ ఫైనల్ చేస్తారని మరి కొందరు అంటున్నారు. మొత్తానికి పదవుల పంపకాలలో వైసీపీ నేతలకు ఉన్న సస్పెన్స్‌లు అన్నీ కూడా బుధవారం వీడనున్నాయని వైసీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

YS Jagan : ఆ మగ్గురికి ఎమ్మెల్సీ పదవులు.. ప్రకటించనున్న వైసీపీ అధినేత..

ఇకపోతే గత కొద్ది రోజుల నుంచి వైసీపీ నేతలు కొందరు మంత్రి వర్గ విస్తరణ గురించి చర్చించుకుంటున్నారని సమాచారం. కేబినెట్ విస్తరణలో కొత్త వారికి అవకాశాలుంటాయని వార్తలొస్తుండగా, తమకు అందులో అవకాశముంటుందా అని మధనపడుతున్నారట. ఈ క్రమంలోనే కేబినెట్ మినిస్టర్ ఆశలు పెట్టుకున్న వారికి కనీసం ఎమ్మెల్సీ పదవి అయినా దక్కుతుందా అనే చర్చ ఆ పార్టీ వర్గాల్లోనే జరుగుతున్నది.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది