YS Jagan : ఏపీలో ఎయిర్‌ పోర్ట్‌ల అభివృద్దికి వైఎస్ జగన్ మరో అడుగు ముందుకు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

YS Jagan : ఏపీలో ఎయిర్‌ పోర్ట్‌ల అభివృద్దికి వైఎస్ జగన్ మరో అడుగు ముందుకు

YS Jagan : ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న విమానాశ్రయాల నవీనికరణకు మరియు కొత్తగా నిర్మించాల్సిన విమానాశ్రయాలను గురించి సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ కి లేఖ రాయడం జరిగింది. గత కొన్నాళ్లుగా విమానాశ్రయాల విస్తరణ మరియు కొత్త విమానాశ్రయాల నిర్మాణం గురించి ఏపీ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో కొత్త జిల్లాల ప్రకటన తో సీఎం జగన్ మోహన్ రెడ్డి విమానాశ్రయాల నిర్మాణం ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. […]

 Authored By prabhas | The Telugu News | Updated on :26 February 2022,5:30 pm

YS Jagan : ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న విమానాశ్రయాల నవీనికరణకు మరియు కొత్తగా నిర్మించాల్సిన విమానాశ్రయాలను గురించి సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ కి లేఖ రాయడం జరిగింది. గత కొన్నాళ్లుగా విమానాశ్రయాల విస్తరణ మరియు కొత్త విమానాశ్రయాల నిర్మాణం గురించి ఏపీ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో కొత్త జిల్లాల ప్రకటన తో సీఎం జగన్ మోహన్ రెడ్డి విమానాశ్రయాల నిర్మాణం ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. విమానాశ్రయాలు ఉండటం వల్ల అభివృద్ధి మరింతగా సాధించవచ్చు అనే అభిప్రాయంతో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్లుగా తెలుస్తోంది.ఆయన కేంద్రంతో పలు దఫాలుగా చర్చించి పలు కొత్త విమానాశ్రయాలకు అనుమతులను తీసుకు వచ్చారు.

బోగాపురంకి కొత్త విమానాశ్రయం ఇప్పటికే మంజూరు అయిన విషయం తెలిసిందే. ఇక విభజన చట్టంలో ఉన్న విశాఖ, విజయవాడ, తిరుపతి ఎయిర్ పోర్టులను అభివృద్ధి చేయడం కోసం కేంద్రం నిధులు ఇవ్వాలని కూడా జగన్ తన లేఖలో పేర్కొన్నాడు. విశాఖ నేవీ ఎయిర్ పోర్ట్ నుంచి విమానాల రాకపోకలు చేస్తున్నాయి. దాంతో విస్తరణ నిర్వహించేందుకు కేంద్రం అనుమతి ఇవ్వాల్సి ఉంది. గంటకు పది విమానాలకు అనుమతులు వస్తున్నాయి. ఇలా అటు సైనిక అవసరాలకు మరియు డొమెస్టిక్‌ ప్రయాణికులకు విమానాశ్రయంలో డిమాండ్‌ పెరిగింది. దాంతో విశాఖ ఎయిర్ పోర్ట్‌ అత్యంత రద్దీ ఏర్పాటు గా మారడం జరిగింది.ఈ కారణంగానే విశాఖ ఎయిర్‌ పోర్ట్‌ ను విస్తరించండి

 YS Jagan letters to pm modi over airports development

YS Jagan letters to pm modi over airports development

అంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డి మోడీ కి రాసిన లేఖలో పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోడీ ఈ విషయమై వెంటనే స్పందించాలని విమానయాన శాఖ మంత్రి వర్యులు ఏపీ లోని విమాన ఎయిర్ స్టేషన్ కి సంబంధించిన నిర్ణయాలను తీసుకోవాలంటూ ముఖ్యమంత్రి జగన్ నా లేఖలో విజ్ఞప్తి చేశారు. గతంలో ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా ముఖ్యమంత్రి జగన్ మోహన్‌ రెడ్డి కేంద్ర మంత్రులు మరియు ప్రధాని తో కూడా ఏపీ లో ఉన్న ఎయిర్ పోర్ట్ లు మరియు కొత్తగా అందవలసిన ఎయిర్ పోర్ట్ ల గురించి చర్చ జరగడం జరిగింది. ఈ విషయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్ గా ఉన్నారని తెలుస్తోంది. ఆయన హయాంలోనే కొత్త ఎయిర్ పోర్ట్‌ లకు శంకుస్థాపన జరిగే అవకాశం ఉంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది