YS Jagan : ఒంటరిగా ఢిల్లీ కోట బద్దలు కొట్టిన వైఎస్ జగన్ ను టీడీపీ ఏం చేయలేదు

Authored By Himanshi | The Telugu News | Published on: March 4, 2022, 6:10 am

YS Jagan : వివేకా హత్య రాజకీయం చేసేందుకు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరియు ఆ పార్టీ నాయకులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ ఆరోపించారు. వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా సీఎం జగన్ మోహన్ రెడ్డి గారిని ఏమి చేయలేరు అని అన్నాడు. గతంలో చంద్రబాబు నాయుడు ఆయన బామ్మర్దిని భావని మేనల్లుడిని తోడల్లుడిని ఇలా ప్రతి ఒక్కరినీ వాడుకుని వదిలేశాడు.

కుటుంబాన్ని రాజకీయం కోసం వాడుకునే చంద్రబాబు నాయుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎంపీ ఆరోపించాడు. వివేకా కూతురు డాక్టర్ సునీత గారు కూడా చంద్రబాబు నాయుడు చేతిలో పావుగా మారి దేవుడు లాంటి జగన్మోహన్ రెడ్డి గారి పై విమర్శలు చేయడం తగదు అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. తెలుగుదేశం పార్టీ లోకి వెళ్ళాలి అనుకుంటే సైలెంట్ గా ఆమె వెళ్ళ వచ్చు.వెళ్తూ వెళ్తూ వైకాపా నాయకులపై తప్పుడు ప్రచారం చేసి వారిపై కేసులు పెట్టడం ద్వారా ఆమె లబ్ది పొందాలని చూడటం భావ్యం కాదని అన్నాడు.

YS Jagan margani bharath fires chandrababu about viveka case

YS Jagan margani bharath fires chandrababu about viveka case

ఒంటరిగా ఢిల్లీ కోట బద్దలు కొట్టి భారీగా ఎంపీ స్థానాలు దక్కించుకున్న వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి ని చంద్రబాబు నాయుడు లేదా టిడిపి నాయకులు ఏ ఒక్కరు కనీసం ఒక్క ఇంచ్ కూడా కదిలించలేరు. ఆయనే వచ్చే ఎన్నికల్లో గెలిచి సీఎంగా మరో సారి గద్దె ఎక్కడం ఖాయం అంటూ ఎంపీ మార్గాని భరత్ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైనా తెలుగు దేశం పార్టీ నాయకులు శవ రాజకీయాలను మానేయాలని ఆయన హితవు పలికాడు.

Himanshi

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp