YS Jagan : జగన్ విజయవాడలో సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ని కలిసినప్పుడు ఆశ్చర్యకర సంఘటన …!!
YS Jagan : సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఇవాళ ఏపీ పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఆయన ఏపీలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. తాజాగా ఆయన అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే.. ఏపీ జ్యుడిషియల్ అకాడమీని ప్రారంభించారు. అయితే.. చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన తొలిసారిగా ఏపీకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఢిల్లీ నుంచి డైరెక్ట్ గా తిరుపతికి వచ్చిన చంద్రచూడ్.. ముందు తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత శ్రీనివాస మంగాపురం, ఆ తర్వాత తిరుమల శ్రీవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆ తర్వాత విజయవాడకు చేరుకున్నారు. నోవోటెల్ హోటల్ లో సీజేఐ స్టే చేశారు. దీంతో సీఎం జగన్ వెళ్లి సీజేఐని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
YS Jagan : 20 నిమిషాల పాటు సీజేఐతో సమావేశమయిన చంద్రచూడ్
సుమారు 20 నిమిషాల పాటు సీజేఐ చంద్రచూడ్ తో సీఎo జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మూడు రాజధానుల అంశంపై కూడా సీజేఐతో జగన్ చర్చించారు. అమరావతిలో ఉన్న హైకోర్టును కర్నూలుకు తరలించే అంశంపై కూడా సీఎం జగన్ చర్చించారు. నిజానికి.. మూడు రాజధానుల ఏర్పాటు ప్రతిపాదనలు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న విషయం తెలిసిందే. కర్నూలులో హైకోర్టు కోసం శాశ్వత భవనాన్ని నిర్మించడం గురించి అలాగే జిల్లా స్థాయి కోర్టులలో ఉన్న ఖాళీల భర్తీ గురించి కూడా సీఎం జగన్ సీజేఐతో చర్చించినట్టు తెలుస్తోంది.