YS Jagan : ఆంధ్రప్రదేశ్‌లో మొదలైన ఎమ్మెల్సీ నామినేషన్లు.. జగన్ పక్కా వ్యూహం
YS Jagan : ఏపీలో మళ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. అదేనండి.. ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి. ఇప్పటికే నామినేషన్ల సందడి కూడా మొదలైంది. దీంతో ఏపీలో ఎక్కడ చూసినా నామినేషన్ల బిజీ కనిపిస్తోంది. ఇంకా ప్రచారం కూడా స్టార్ట్ కాలేదు.. అప్పుడే పార్టీలు ఒకరి మీద మరొకరు ఆరోపణలు చేసుకోవడం ప్రారంభించారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ నామినేషన్ల కోసం వైజాగ్ లో నేతలంతా బిజీ బిజీగా ఉన్నారు. వైసీపీ నుంచి ఉత్తరాంధ్ర అభ్యర్థిగా సీతంరాజు సుధాకర్ నామినేషన్ వేశారు.
టీడీపీ తరుపున చిరంజీవి నామినేషన్ వేశారు. బీజేపీ నుంచి మాధవ్ నామినేషన్ వేశారు. బీజేపీ అభ్యర్థి నామినేషన్ కు బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు హాజరయ్యారు. ఇక అనంతపురంలో వైసీపీ అభ్యర్థులు రవీంద్రారెడ్డి, మంగమ్మ నామినేషన్ దాఖలు చేశారు. చిత్తూరులో టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రారెడ్డికి వైసీపీ మద్దతు ప్రకటించింది. చిత్తూరు జిల్లాలో పట్టభద్రుల స్థానానికి ఏడు నామినేషన్లు దాఖలు కాగా, ఉపాధ్యాయ స్థానానికి ఒక నామినేషన్ దాఖలు అయింది.
YS Jagan : చిత్తూరులో పట్టభద్రుల స్థానానికి ఏడు నామినేషన్లు
అయితే స్థానిక సంస్థల కోటా స్థానం కోసం ఇప్పటి వరకు ఒక్క నామినేషన్ కూడా ఎవ్వరూ వేయలేదు. ఇక.. కడప నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైసీపీ నుంచి రామసుబ్బారెడ్డి నామినేషన్ వేశారు. ఆయన రెండు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. కడపలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వైసీపీ అభ్యర్థి ఎన్నిక ఖాయం అయినట్టే. ఎందుకంటే.. కడపలో టీడీపీ, ఇతర పార్టీలకు సంఖ్యా బలం లేదు. అయితే.. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అభ్యర్థుల ఎంపికలో సీఎం జగన్ సామాజిక న్యాయాన్ని పాటించడంతో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ నాయకులు.. జగన్ ను కొనియాడుతున్నారు.