Ys Jagan : ప్రతి మహిళ సురక్షితంగా ఉండేలా చూసే బాధ్యత నాది వైయస్ జగన్
Ys Jagan : దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో మహిళల భద్రత కోసం దిశ అనే ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చిన ఘనత ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. ఆడ వారిపై జరుగుతున్న అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేసేందుకు జగన్మోహన్ రెడ్డి మరియు ఆయన మంత్రి వర్గ సభ్యులు కలిసి ఏర్పాటు చేసిన దిశ చట్టం అద్భుతంగా పని చేస్తుంది. ఇదే సమయంలో దిశ మొబైల్ యాప్ కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంది అంటూ మహిళలు మరియు అమ్మాయిలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మొబైల్లో ఒక్క క్లిక్ తో తాము ఏ పరిస్థితిలో ఉన్న కూడా పోలీసుల యొక్క ప్రొటెక్షన్ నిమిషాల వ్యవధిలోనే పొందగలుగుతున్నాం అని ఆడవారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయం లో దిశ చట్టం మరియు దిశ మొబైల్ యాప్ పని తీరుపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ దిశా యాప్ ద్వారా వచ్చిన కంప్లైంట్ లపై నిమిషాల వ్యవధిలోనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని.. కంప్లైంట్ వచ్చిన వెంటనే స్పందించి ఘటనా స్థలానికి వెళ్లాలి అంటూ ఆదేశించారు.

Ys Jagan my responsibility to make sure that every woman is safe
ఆడవారి పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలంటూ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. సీఎం జగన్ ఆదేశాలనుసారం దిశ చట్టం మరియు దిశ యాప్ ను మరింతగా బలోపేతం చేసేందుకు గాను అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతి పోలీస్స్టేషన్ పరిధిలో కూడా దిశ చట్టం అమలు కోసం ప్రత్యేకంగా మహిళా కానిస్టేబుళ్లను మరియు ప్రత్యేక వసతులను ఏర్పాటు చేసేందుకు అధికారులు ఇప్పటికే సిద్ధమయ్యారు. ఏ ఒక్క అమ్మాయి కానీ.. అమ్మ కానీ.. అక్క కానీ ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకు వచ్చిన ఈ అద్భుతమైన చట్టానికి దేశ వ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి.