YS Jagan : జగన్ సరికొత్త ప్లాన్.. ఈ సారి వాళ్లే తనను గెలిపిస్తారట..
YS Jagan : వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి 2019 సాధారణ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుచుకుని సీఎం పీఠమెక్కిన సంగతి అందరికీ విదితమే. ఇందుకు ఆయన సుదీర్ఘ కాలం పాటు ప్రజల్లో చేసిన పాదయాత్ర, పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన నవరత్నాల వంటి హామీలు, టీడీపీపై ఉన్న వ్యతిరేకత బాగా పని చేశాయి. మొత్తంగా జగన్ ఒక్కడే సింగిల్‌గా వచ్చి సూపర్ సక్సెస్ అయి ముఖ్యమంత్రి పీఠం కైవసం చేసుకున్నాడు. అయితే, వచ్చి ఎన్నికల్లో అటువంటి పరిస్థితులు అయితే కనబడుటలేదని పలువురు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్ సరికొత్త ప్లాన్ వేశారని అంటున్నారు.
YS Jagan : మరోసారి సీఎం పీఠమెక్కేందుకు ప్లాన్ చేంజ్ చేసిన జగన్..
గత ఎన్నికల్లో వైసీపీ తరఫున ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన అభ్యర్థుల కంటే కూడా జగన్ చరిష్మ చూసే చాలా చోట్ల ఓట్లు పడ్డాయి. అయితే, ఈ సారి అటువంటి పరిస్థితులు ఉండబోవు. ఎందుకంటే అత్యధిక నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. మరోసారి జగన్ అధికారంలోకి రావాలంటే వారందరూ మళ్లీ గెలవాలి. అనగా స్థానికంగా శాసన సభ్యులు చేసిన అభివృద్ధి, పనులు ఓట్లు తీసుకురావడంలో కీలకంగా మారుతాయి. గతంలో మాదిరిగా జగన్‌ను చూసి గంపగుత్తగా 175 నియోజకవర్గాల్లో ఓట్లు పడే అవకాశాలు అయితే లేవు. జగన్ ఐదేళ్ల పాలనను చూసిన తర్వాతనే దాని మీద ఓ అంచనాకు వచ్చిన తర్వాతనే ఓట్లు వేస్తారు ప్రజలు.
గతంలో మాదిరిగా ఈ సారి కూడా జగన్ వర్సెస్ చంద్రబాబు అనే సీన్ ఉన్నప్పటికీ స్థానికంగా ఉండే అభ్యర్థుల పనితీరు క్రైటిరియాగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక కీలకం. కాగా, ఈ సారి దాదాపు 70 నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలనే ఆలోచనలో వైసీపీ అధినేత జగన్ ఉన్నట్లు సమాచారం. పార్టీలోకి కొత్త రక్తం ఎక్కిస్తేనే మళ్లీ తాను సీఎం అవుతానని జగన్ అనుకుంటున్నట్లు వినికిడి. ఈ క్రమంలోనే మరోసారి ముఖ్యమంత్రి అయ్యేందుకుగాను జగన్ ఇప్పటి నుంచే సరికొత్త ప్లాన్స్ వేస్తున్నట్లు వైసీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది.