Ys jagan : వైఎస్‌ జగన్ టార్గెట్ చేస్తే ఇలా ఉంటదా? కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది ఆ మంత్రి పరిస్థితి? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Ys jagan : వైఎస్‌ జగన్ టార్గెట్ చేస్తే ఇలా ఉంటదా? కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది ఆ మంత్రి పరిస్థితి?

Ys jagan డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అసలే అలక మీద ఉన్నారు. ఈ తరుణంలో నారాయణస్వామికి మరో సమస్య వచ్చిపడింది. దీంతో ఎక్కడ పడితే, అక్కడ నారాయణస్వామి తన సొంత డబ్బా మోగిస్తున్నారని కేడర్ చెబుతోంది. వైసీపీలో కీల‌క మంత్రిగా ఉన్న చిత్తూరు జిల్లాకు చెందిన నారాయ‌ణస్వామి అలిగారా ? లేక ఏదైనా అవ‌మానం జ‌రిగిందా ? ఇదీ.. ఇప్పుడు ఆస‌క్తిగా మారిన చ‌ర్చ. కొన్నాళ్లుగా నారాయణస్వామి అసలు తాడేప‌ల్లి వైపు క‌న్నెత్తి చూడడం లేదు. […]

 Authored By sukanya | The Telugu News | Updated on :11 July 2021,12:30 pm

Ys jagan డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అసలే అలక మీద ఉన్నారు. ఈ తరుణంలో నారాయణస్వామికి మరో సమస్య వచ్చిపడింది. దీంతో ఎక్కడ పడితే, అక్కడ నారాయణస్వామి తన సొంత డబ్బా మోగిస్తున్నారని కేడర్ చెబుతోంది. వైసీపీలో కీల‌క మంత్రిగా ఉన్న చిత్తూరు జిల్లాకు చెందిన నారాయ‌ణస్వామి అలిగారా ? లేక ఏదైనా అవ‌మానం జ‌రిగిందా ? ఇదీ.. ఇప్పుడు ఆస‌క్తిగా మారిన చ‌ర్చ. కొన్నాళ్లుగా నారాయణస్వామి అసలు తాడేప‌ల్లి వైపు క‌న్నెత్తి చూడడం లేదు. పైగా తిరుప‌తి పార్లమెంటు ఉప ఎన్నిక‌లోనూ నారాయణస్వామి హడావిడి ఎక్కడా క‌నిపించ‌లేదు. జిల్లాకే చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నెల్లూరు జిల్లాకు చెందిన మ‌రో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ లు అక్కడ వ్యవ‌హారాలు అన్ని చ‌క్క పెట్టేశారు. ఉప ఎన్నిక‌ల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు అంద‌రూ ప్రచారం చేయాల‌ని.. సీఎం జ‌గ‌న్మోహన్ రెడ్డి Ys jagan ఆదేశించినా.. తొలి రెండు రోజులు వ‌చ్చి.. మ‌మ అనిపించి వెళ్లిపోయారు. అప్పుడు కూడా ఒంట‌రిగా ప్రచారం చేశారు. కీల‌క‌మైన మంత్రి, ఇదే జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డితోనూ నారాయ‌ణ‌స్వామి క‌లిసి ప‌నిచేయ‌లేదు. నారాయణస్వామి అస‌హ‌నానికి కార‌ణం ఏంటి ? ఏం జ‌రిగింది? అనేది చ‌ర్చకు దారితీస్తోంది.

Ys jagan

Ys jagan

Ys jagan దక్కని స్థానికం క్రెడిట్..

చిత్తూరు జిల్లాలో జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లోనూ వైసీపీ మ‌ద్దతుదారులు ఎక్కువ‌గా గెలుపు గుర్రం ఎక్కేందుకు నారాయణస్వామి ప్రయ‌త్నించారు. అదేవిధంగా తిరుప‌తి కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లోనూ నారాయణస్వామి కొంత మేర‌కు కృషి చేశారు. ఇక‌, ఇక్కడ వ‌చ్చిన ఫ‌లితాలు.. సీఎం వైఎస్‌ జ‌గ‌న్‌కు ఆనందం క‌లిగించాయి. అయితే.. ఈ క్రెడిట్ లో .. మంత్రి నారాయ‌ణస్వామికి ఏమాత్రం ప్రాధాన్యం ల‌భించ‌లేదని అనుచ‌రులు పేర్కొంటున్నారు. పైగా.. మొత్తంగా క్రెడిట్ అంతా.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికే ద‌క్కింద‌ని.. సీఎం వైఎస్‌ జగన్ జ‌గ‌న్ ద‌గ్గర ఆయ‌న‌కే మంచి మార్కులు ల‌భించాయ‌ని.. దీంతో నారాయ‌ణ స్వామి ముభావంగా ఉంటున్నారని అనుచ‌రులు పేర్కొంటున్నారు. మ‌రోవైపు.. న‌గ‌రి వైసీపీ పంచాయ‌తీ విష‌యం కూడా మంత్రి నారాయ‌ణ‌స్వామికి సెగ పెడుతోంద‌ని అంటున్నారు. ఇక్కడ నిజానికి ఆయ‌న ప్రభావం త‌క్కువే ఉన్నా.. పెద్దిరెడ్డిరామచంద్రారెడ్డితో క‌లిసి ముందుకు సాగుతున్నారు.

Ysrcp

Ysrcp

Ys jagan మంత్రి గిరీ కోసం నానా పాట్లు..

ఇక‌, ఎంత చేసినా.. త‌న‌కు ఏమాత్రం వాల్యూ ఇవ్వడం లేద‌ని భావిస్తున్నార‌ని.. అందుకే నారాయ‌ణస్వామి సైలెంట్ అయ్యార‌ని అనుచరులు చెబుతున్నారు. అయితే తాజాగా రెండున్నరేళ్ల డెడ్‌లైన్‌ దగ్గర పడుతోంది. దీంతో తన పీఠాన్ని కాపాడుకోవడానికి నారాయణ స్వామి నానా ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. అవసరం ఉన్నా, లేకున్నా తన డప్పు తానే కొట్టుకుంటున్నారని కేడర్ చెబుతోంది. తాజాగా ఓ సమావేశంలోనూ అదే విషయాన్ని చెప్పడంతో, ఉన్నట్టుండి మంత్రి నారాయణస్వామి ఎందుకీ కామెంట్స్‌ చేశారని నేతలు, కేడర్ చర్చించుకోవడం మొదలెట్టారు. సభలు, సమావేశాలు, సమీక్షల్లో.. ఆఖరికి మీడియా కనిపించినా నారాయణస్వామి ఇదే చెబుతున్నారని టాక్ వినిపిస్తోంది. దీంతో అనుచరులు, నాయకులు.. ఎక్కడో ఏదో తేడా కొడుతోందే అన్న చర్చలు నియోజకవర్గంలో మొదలయ్యాయి. రెండున్నరేళ్ల మంత్రి పదవిలో తనకు పాస్‌ మార్కులు పడతాయని పైకి చెబుతున్నా ఎక్కడో ఏదో అనుమానం, భయం నారాయణస్వామిని వెంటాడుతున్నాయని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

sukanya

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది