YS Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన మనసులో ఏదైనా అనుకుంటే దాన్ని బయట పెడితే విమర్శలు వస్తాయేమో అని కూడా ఆలోచించకుండా తాను అనుకున్నది అనుకున్నట్లుగా చేసుకుంటూ వెళ్తాడు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా దేశ వ్యాప్తంగా 10వ మరియు ఇంటర్ తరగతుల పరీక్షలు క్యాన్సిల్ చేసి ప్రమోట్ చేశారు. కాని ఏపీలో మాత్రం ఆ పరీక్షలు జరిపి తీరుతామని అంటున్నారు. విద్యార్థులు చాలా నష్టపోతారని, వారి సర్టిఫికెట్ లు జీవితాంతం పనికి రాకుండా పోకూడదు అనే ఉద్దేశ్యంతో తాను ఈ పని చేస్తున్నట్లుగా జగన్ బలంగా చెప్పుకొచ్చడు. కరోనా కేసులు ఎన్ని ఉన్నా జాగ్రత్తలు తీసుకుని పరీక్షలు నిర్వహించాలని నిర్ణయానికి వచ్చాడు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజన్ చాలా క్లీయర్ గా ఉంటుంది. ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ విషయంలో కూడా ఆయన చెబుతున్న లెక్కలు నిజమే అనిపిస్తున్నాయి.
దేశ వ్యాప్తంగా రేపటి నుండి 18 ఏళ్ల వయసు వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పింది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇప్పటికే మే 15 వరకు వ్యాక్సిన్ తీసుకునేందుకు గాను యువత పెద్ద ఎత్తున రిజిస్ట్రర్ చేయించుకున్నారు. అయితే ఇప్పుడు వెంటనే ఇంత మందికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు డోసులు సిద్దంగా లేవు. మన దేశంలో నెలకు ఏడు నుండి ఎనిమిది కోట్ల డోసులు తయారు అవుతున్నాయి. 18 నుండి 45 ఏళ్ల లోపు వారు దేశంలో దాదాపుగా 60 కోట్ల మంది ఉన్నారు. వారు అందరికి కూడా వ్యాక్సిన్ అందాలి అంటే చాలా సమయం పడుతుంది. అందుకే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో సెప్టెంబర్ నుండి వారికి వ్యాక్సిన్ ఇవ్వాలని సూచిస్తున్నాడు.
ఆగస్టు నాటికి కొత్తగా 20 కోట్ల వ్యాక్సిన్ లు ఉత్పత్తి అవుతాయని అంచనా. అయినా కూడా దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు ఇంకా చాలా సమయం పడుతుంది. ఈ సమయంలో అందరికి వ్యాక్సిన్ అంటే గందరగోళ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తప్పుబడుతున్నాడు. వ్యాక్సిన్ అందరికి ఒకేసారి ఇవ్వడం అనేది సాధ్యం కాదు కనుక సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచన మేరకు ప్రధాని నరేంద్ర మోడీ వ్యాక్సిన్ ఇవ్వాలంటూ నిపుణులు సూచిస్తున్నారు. కాని ఇప్పటికే వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ లు జరుగుతున్నాయి. కనుక వ్యాక్సినేషన్ డోసులు ఎలా ఉత్పత్తి చేస్తారనేది చూడాలి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.