Categories: NewsTelanganaTrending

లాక్ డౌన్‌ పై KCR వ్యూహాత్మక నిర్ణయం!

KCR : దేశ వ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రతి రోజు కూడా మూడున్నర లక్షలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. మూడు నాలుగు రోజుల్లో రోజు వారి కేసుల సంఖ్య అయిదు లక్షల వరకు చేరే అవకాశం ఉందంటున్నారు. ఇలాంటి సమయంలో కరోనా ను అదుపులోకి తీసుకు వచ్చేందుకు కేంద్రం లాక్ డౌన్‌ ను విధించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. మే 3న లేదా మే మొదటి వారంలో ఏ రోజు నుండైనా లాక్ డౌన్‌ ను అమలు చేయాలని కేంద్రం నిర్ణయానికి వచ్చింది. లాక్‌ డౌన్‌ ను కఠినంగా అమలు చేయకుండా కొన్నింటికి మినహాయింపు ఇచ్చి లాక్ డౌన్ ను కొనసాగించాలని కేంద్రం భావిస్తున్న సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేడు కీలక నిర్ణయం తీసుకోబోతుంది.

kcr night curfew or mini lockdown in telangana

నేటితో నైట్‌ కర్ఫ్యూ గడువు పూర్తి..

తెలంగాణలో ఏప్రిల్‌ 30 వరకు నైట్‌ కర్ఫ్యూ అంటూ కేసీఆర్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నేటితో నైట్ కర్ఫ్యూ గడువు ముగియబోతుంది. దాంతో రేపటి నుండి పరిస్థితి ఏంటా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పాక్షికంగా లాక్ డౌన్‌ ను ప్రకటించబోతున్నారా లేదంటే నైట కర్ఫ్యూను కంటిన్యూ చేస్తారా అనేది నేడు సీఎం కేసీఆర్‌ తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. ఆయన అధికారులు మరియు ఆరోగ్య శాఖ సిబ్బందితో చర్చలు జరిపి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. లాక్ డౌన్ విషయంలో కేసీఆర్‌ నిర్ణయం తీసుకోక పోవచ్చు అంటున్నారు.

కేంద్రంపైనే నింద..

లాక్‌ డౌన్‌ వల్ల ఒరిగేది ఏమీ లేదు అంటూ గత ఏడాది లాక్ డౌన్‌ వల్ల తెలిసి వచ్చింది. అందుకే లాక్ డౌన్‌ ను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించడం లేదు. ఒక వేళ లాక్‌ డౌన్ ను విధించినా కూడా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎలాగూ దేశ వ్యాప్తంగా కేంద్రం లాక్‌ డౌన్ ను విధించాలని భావిస్తుంది. కనుక ఆ నింద ఏదో కేంద్ర ప్రభుత్వంకే పడనివ్వు అన్నట్లుగా కేసీఆర్‌ భావిస్తున్నారట. రేపటి నుండి ప్రత్యేకంగా మార్పు ఏమీ లేకుండా నైట్‌ కర్ఫ్యూను కంటిన్యూ చేస్తారని ప్రభుత్వ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. కేంద్రం లాక్ డౌన్ నిర్ణయం తీసుకుంటే కేసీఆర్‌ సమర్ధించే అవకాశం ఉందని అంటున్నారు. లాక్ డౌన్‌ నింద మోయకుండా కేసీఆర్‌ వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకుంటున్నారు.

ఇది కూడా చ‌ద‌వండి==> Exit Polls : నాగార్జున సాగర్ ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయ్? గెలుపు ఎవరిదో తెలిసిపోయింది?

ఇది కూడా చ‌ద‌వండి==> క‌రోనా టైమ్‌లో గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్ర‌భుత్వం

Recent Posts

iPhone 16 : ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఐఫోన్ 16 కేవలం రూ.33,400కే..!

iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…

59 minutes ago

Tamannaah : నా ఐటెం సాంగ్స్ చూడకుండా చిన్న పిల్లలు అన్నం కూడా తినరు : తమన్నా

Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…

1 hour ago

Jagadish Reddy : కవిత వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి కౌంటర్..

Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…

3 hours ago

Devara 2 Movie : దేవ‌ర 2 సినిమా సెట్స్‌పైకి వెళ్లేదెప్పుడు అంటే… జోరుగా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు

Devara 2 Movie : యంగ్‌ టైగర్‌ జూ ఎన్టీఆర్ న‌టించిన చిత్రం దేవ‌ర ఎంత పెద్ద హిట్ అయిందో…

4 hours ago

Little Hearts Movie : సెప్టెంబర్ 12న రిలీజ్‌కు సిద్ద‌మ‌వుతున్న‌ “లిటిల్ హార్ట్స్..!

"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…

6 hours ago

Viral Video : ఇదెక్క‌డి వింత ఆచారం.. వధువుగా అబ్బాయి, వరుడిగా అమ్మాయి.. వైర‌ల్ వీడియో !

Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…

6 hours ago

Satyadev : ‘కింగ్‌డమ్’ సినిమాకి వచ్చినంత పేరు నాకు ఎప్పుడూ రాలేదు : సత్యదేవ్

Satyadev  : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…

7 hours ago

Ponnam Prabhakar : బనకచర్ల పేరుతో నారా లోకేష్ ప్రాంతీయతత్వం రెచ్చగొడుతున్నారు : పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…

8 hours ago