YS Jagan : మా జగనన్న మాట ఒక్కసారి వినిపించుకోండి మోడీ గారు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YS Jagan : మా జగనన్న మాట ఒక్కసారి వినిపించుకోండి మోడీ గారు

 Authored By himanshi | The Telugu News | Updated on :30 April 2021,6:00 pm

YS Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి తన మనసులో ఏదైనా అనుకుంటే దాన్ని బయట పెడితే విమర్శలు వస్తాయేమో అని కూడా ఆలోచించకుండా తాను అనుకున్నది అనుకున్నట్లుగా చేసుకుంటూ వెళ్తాడు. కరోనా సెకండ్‌ వేవ్ కారణంగా దేశ వ్యాప్తంగా 10వ మరియు ఇంటర్ తరగతుల పరీక్షలు క్యాన్సిల్‌ చేసి ప్రమోట్‌ చేశారు. కాని ఏపీలో మాత్రం ఆ పరీక్షలు జరిపి తీరుతామని అంటున్నారు. విద్యార్థులు చాలా నష్టపోతారని, వారి సర్టిఫికెట్‌ లు జీవితాంతం పనికి రాకుండా పోకూడదు అనే ఉద్దేశ్యంతో తాను ఈ పని చేస్తున్నట్లుగా జగన్‌ బలంగా చెప్పుకొచ్చడు. కరోనా కేసులు ఎన్ని ఉన్నా జాగ్రత్తలు తీసుకుని పరీక్షలు నిర్వహించాలని నిర్ణయానికి వచ్చాడు. సీఎం వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి విజన్‌ చాలా క్లీయర్ గా ఉంటుంది. ఇప్పుడు కోవిడ్‌ వ్యాక్సిన్ విషయంలో కూడా ఆయన చెబుతున్న లెక్కలు నిజమే అనిపిస్తున్నాయి.

వారికి ఇప్పుడే వ్యాక్సిన్‌ వద్దు..

ys jagan about covid vaccine

ys jagan about covid vaccine

దేశ వ్యాప్తంగా రేపటి నుండి 18 ఏళ్ల వయసు వారికి వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పింది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇప్పటికే మే 15 వరకు వ్యాక్సిన్‌ తీసుకునేందుకు గాను యువత పెద్ద ఎత్తున రిజిస్ట్రర్ చేయించుకున్నారు. అయితే ఇప్పుడు వెంటనే ఇంత మందికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు డోసులు సిద్దంగా లేవు. మన దేశంలో నెలకు ఏడు నుండి ఎనిమిది కోట్ల డోసులు తయారు అవుతున్నాయి. 18 నుండి 45 ఏళ్ల లోపు వారు దేశంలో దాదాపుగా 60 కోట్ల మంది ఉన్నారు. వారు అందరికి కూడా వ్యాక్సిన్ అందాలి అంటే చాలా సమయం పడుతుంది. అందుకే సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గతంలో సెప్టెంబర్‌ నుండి వారికి వ్యాక్సిన్ ఇవ్వాలని సూచిస్తున్నాడు.

ఆగస్టు లేదా సెప్టెంబర్‌ నాటికి..

ఆగస్టు నాటికి కొత్తగా 20 కోట్ల వ్యాక్సిన్‌ లు ఉత్పత్తి అవుతాయని అంచనా. అయినా కూడా దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్‌ ను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు ఇంకా చాలా సమయం పడుతుంది. ఈ సమయంలో అందరికి వ్యాక్సిన్ అంటే గందరగోళ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంను సీఎం వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి తప్పుబడుతున్నాడు. వ్యాక్సిన్‌ అందరికి ఒకేసారి ఇవ్వడం అనేది సాధ్యం కాదు కనుక సీఎం వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి సూచన మేరకు ప్రధాని నరేంద్ర మోడీ వ్యాక్సిన్‌ ఇవ్వాలంటూ నిపుణులు సూచిస్తున్నారు. కాని ఇప్పటికే వ్యాక్సిన్‌ కోసం రిజిస్ట్రేషన్‌ లు జరుగుతున్నాయి. కనుక వ్యాక్సినేషన్‌ డోసులు ఎలా ఉత్పత్తి చేస్తారనేది చూడాలి.

Advertisement
WhatsApp Group Join Now

himanshi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది