YS Jagan : పులివెందుల విషయంలో సీఎం జగన్ షాకింగ్ నిర్ణయం..! ఇది ఎవరూ ఊహించనిది..!
YS Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక ఎంతో మేథోమథనం జరుగుతుంది. అంత ఈజీగా ఆయన ఏ నిర్ణయం తీసుకోరు. ఆయన సన్నిహితులతో చర్చించి ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటారు. ఆయన ఆలోచనా విధానం కూడా చాలా ముందుచూపుతో ఉంటుంది. దానికి నిదర్శనమే ప్రస్తుతం ఏపీలో ఉన్న సంక్షేమ పథకాలు. వైఎస్ జగన్ అంటేనే ముందు గుర్తొచ్చేది పులివెందుల. ఆయనకు పులివెందులతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. పులివెందుల నుంచి పోటీ చేసిన ప్రతిసారి ఆయన్ను పులివెందుల ప్రజలు గెలిపిస్తూ వస్తున్నారు. వైఎస్సార్ రాజకీయాల్లో చేరడం దగ్గర్నుంచి.. ఆయన రెండుసార్లు ముఖ్యమంత్రి కావడం వెనుక పులివెందుల ప్రజల పాత్ర కూడా అమోఘం. వైఎస్సార్ తర్వాత మళ్లీ పులివెందుల ప్రజలు ఆయన కొడుకు జగన్ ను అక్కున చేర్చుకున్నారు.
అయితే.. వైఎస్ జగన్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే నియోజకవర్గాలు మారనున్నట్టు తెలుస్తోంది. సాధారణంగా వైఎస్ జగన్ పులివెందుల నుంచి పోటీ చేస్తారని తెలుసు. కానీ.. ఈసారి వైఎస్ జగన్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారని.. రాజకీయంగా ప్రత్యర్థులను ఎదుర్కోవడం కోసం ఆయన డేరింగ్ స్టెప్ తీసుకున్నట్టు తెలుస్తోంది.
YS Jagan : పులివెందులతో పాటు మరో నియోజకవర్గంలోనూ జగన్ పోటీ?
పులివెందులలో పోటీ చేస్తే అది కేవలం రాయలసీమ వరకే పరిమితం అవుతుంది. అదే.. జగన్ ఉత్తరాంధ్రలో ఓ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే అప్పుడు ఉత్తరాంధ్రకు కూడా సమన్యాయం చేసినట్టు అవుతుంది అని భావిస్తున్నారట. అందుకే.. పులివెందులతో పాటు ఉత్తరాంధ్రలోని ఓ కీలక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని జగన్ భావిస్తున్నారట. దీని వల్ల.. ఉత్తరాంధ్ర ప్రజలకు సీఎం జగన్ దగ్గరవడంతో పాటు అక్కడ వైసీపీ కూడా బలపడే అవకాశం ఉంది.
మరోవైపు సీఎం జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానుల అంశం కూడా ఇంకా కోర్టులోనే నానుతోంది. దానిపై ఇంకా తీర్పు వెలువడలేదు. ఉత్తరాంధ్రలో పోటీ చేసి ఉత్తరాంధ్ర ప్రజల మద్దతును కూడగట్టుకొని మూడు రాజధానులను కూడా సఫలం చేసుకోవాలని సీఎం జగన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయం గురించి ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ నేతలతో సీఎం జగన్ చర్చించారట. మరి.. పులివెందులతో పాటు మరో ఉత్తరాంధ్ర నియోజకవర్గంలో పోటీ చేస్తే సీఎం జగన్ ను అక్కడ గెలిపిస్తారా? రాజకీయాలు ఎలా మారనున్నాయో మున్ముందు తెలియనుంది.