YS Jagan : జగన్ రూటే సపరేటు.. టార్గెట్ ఫిక్స్.. బీ రెడీ..!!
YS Jagan : ఏపీలో అసెంబ్లీ సమావేశాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈనేపథ్యంలో అసెంబ్లీలో వ్యవహరించాల్సిన తీరుపై వైసీపీ ప్రభుత్వం ఇప్పటి నుంచే పథకాలు రచిస్తోంది. ఈనెల 14 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యలో అసెంబ్లీలో ఏ బిల్లులు ప్రవేశపెట్టాలి అనే దానిపై చర్చించేందుకు అదే రోజు మంత్రి వర్గ సమావేశం ఉండనుంది. ఆ మంత్రివర్గ సమావేశంలోనే మూడు రాజధానుల అంశం గురించి సీఎం జగన్ చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అంటే.. వైజాగ్ కు పరిపాలన రాజధాని ఎప్పుడు షిఫ్ట్ అవుతుందో సీఎం జగన్ చెబుతారన్నమాట.
14న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయినా.. 14న గవర్నర్ ప్రసంగమే ఉంటుంది. 15న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతారు. 17వ తారీఖున ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఏపీ బడ్జెట్ 2023 ని ప్రవేశపెడతారు. ఆ తర్వాత సీఎం జగన్ మూడు రాజధానుల అంశం గురించి ప్రకటన చేస్తారు అని తెలుస్తోంది. నిజానికి.. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవ్వడానికి ముందే సుప్రీంలో మూడు రాజధానుల అంశం విచారణ పూర్తవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఏపీ హైకోర్టు అమరావతికే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాజధాని వికేంద్రీకరణ,
YS Jagan : దానికోసమే మరోసారి సుప్రీం తలుపు తట్టిన ఏపీ ప్రభుత్వం
అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో ఏపీ ప్రభుత్వం సుప్రీంలో పిటిషన్ ఫైల్ చేసింది. దానిపై విచారణ మాత్రం త్వరగా ముగియడం లేదు. మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్నాయి. అలాగే.. అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్వహించి బడ్జెట్ ను ప్రవేశపెట్టాల్సి ఉంది. ఈనేపథ్యంలో సీఎం జగన్ మూడు రాజధానుల అంశాన్ని ఓ కొలిక్కి తేవాలని భావిస్తున్నారు. సుప్రీంలో వచ్చే తీర్పు ఆధారంగానే సీఎం జగన్ ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కానీ.. అసెంబ్లీ సమావేశాలకు ముందే.. విశాఖకు పరిపాలన రాజధానిని తరలించే అంశంపై సీఎం జగన్ ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తుండటంతో ఏ ప్రకటన చేస్తారు అని అందరూ అనుకుంటున్నారు.