YS Jagan : ఏపీ గ్రామ సచివాలయ వ్యవస్థ అద్బుతం.. వైఎస్ జగన్ కి మహా అధికారుల ప్రశంసలు
YS Jagan : దేశంలో ఎక్కడా లేని విధంగా అద్భుతమైన వాలంటీర్ వ్యవస్థ ను సీఎం జగన్ మోహన్ రెడ్డి ఒక మంచి విజన్ తో మొదలు పెట్టడం జరిగింది. పరిపాలన అనేది ప్రతి ఒక్కరికి చేరాల్సిన హక్కు. అందుకే ప్రతి ఒక్కరికి కూడా పరిపాలన వనరులు అందాలనే ఉద్దేశ్యంతో గ్రామ వాలంటీర్ వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి తీసుకు వచ్చారు. ఆయన ఏ సమయం లో ఈ వ్యవస్థకు అంకురార్పణ చేశారో కానీ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.ప్రతి గ్రామంలో ఉండే వాలంటీర్ లు ప్రభుత్వ పథకాలను మరియు ఇతర ప్రభుత్వ వనరులను ప్రజలకు నేరుగా అందజేస్తున్నారు.
మధ్యలో దళారీలు లేకపోవడం తో అద్భుతమైన ఫలితాలు ప్రజలు స్వయంగా పొందుతున్నాం అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మొదలు పెట్టిన ఈ వాలంటీర్ వ్యవస్థ మరో సారి జగన్ ను సీఎంగా చేస్తుందని నమ్మకంతో ప్రతి ఒక్కరు ఉన్నారు. ఈ వాలంటీర్ వ్యవస్థను పరిశీలించేందుకు పలు రాష్ట్రాల నుంచి అధికారులు క్యూకడుతున్నారు.కొన్నాళ్ళ క్రితం కర్ణాటక రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ కి ఉన్నతాధికారులు వచ్చి వాలంటీర్ వ్యవస్థ గురించి అడిగి తెలుసుకున్నారు.
ఇప్పుడు మహారాష్ట్రకు చెందిన అధికారుల బృందం ఏపీ కి వచ్చి వాలంటీర్ వ్యవస్థ గురించి మరియు సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. మహారాష్ట్ర అధికారులు వాటికి అద్భుతమైన పథకాలు అంటూ ప్రశంసలు కురిపించారు. మహారాష్ట్ర లో కూడా ఇలాంటి తరహా వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసే ఉద్దేశం వారు ఇక్కడ పర్యటించారని తెలుస్తోంది. వాలంటీర్ వ్యవస్థ అనేది కచ్చితంగా జగన్మోహన్ రెడ్డి యొక్క అద్భుతమైన విజయంగా చెప్పుకోవచ్చు.