Ys Jagan vs chandrababu ఏపీలో తాజా ఘటనలతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకున్న వేళ సీఎం జగన్ ఇంటి వద్ద భద్రత పెంచారు. టీడీపీ నేతలు ఆందోళనలు చేపట్టే అవకాశం ఉన్న నేపధ్యంలో అన్ని దారులను మూసేశారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేశారని వైసిపి నేతలు పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ ఆధ్వర్యంలో భారీగా చంద్రబాబు ఇంటి ప్రధాన ద్వారం బయట ఆందోళనకు దిగారు. దీంతో టిడిపి నేతలకు వైసీపీ నేతలకు మధ్య బాహాబాహి చోటుచేసుకుంది.
ఇక ఈ ఘటనపై తెలుగు తమ్ముళ్లు జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తూ ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. రాజకీయ విమర్శలు తట్టుకోలేకపోతే ఇళ్ళ మీద దాడులకు దిగుతారా అంటూ ప్రశ్నిస్తున్న తెలుగు తమ్ముళ్ళు ఈ ఇంటికి ఆ ఇల్లు ఎంత దూరం ఉంటుందో, ఆ ఇంటికి ఈ ఇల్లు అంతే దూరం ఉంటుందని వైసిపి నేతలను హెచ్చరించారు. తాడేపల్లిలో జగన్ కొంప నుండి చంద్రబాబు నివాసానికి, చంద్రబాబు నివాసం నుండి జగన్ కొంపకు అంతే దూరం ఉంటుందని చెబుతున్నారు.
తాము కూడా జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు ఆందోళన చేయగలమని, దాడులకు దిగగలమని, కాకుంటే టీడీపీ అధినేత చంద్రబాబు సంయమనం పాటించండి అని చెప్పడంతో సైలెంట్ గా ఉన్నామని ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గుర్తిస్తే బాగుంటుందని హెచ్చరించారు. బాబు ఇంటి పై వైసిపి గుండాలు దాడి చేశారని ఆరోపిస్తున్న తెలుగు తమ్ముళ్లు జడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉన్న చంద్రబాబుకి రక్షణ లేకుండా పోయిందని పెద్ద ఎత్తున ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
సీఎం జగన్ నివాసం వైపు వెళ్లే అన్ని దారులను పోలీసులు మూసివేసి, ఎలాంటి ఆందోళన చోటు చేసుకోకుండా పహారా కాస్తున్నారు. సీఎం జగన్ నివాసం వైపు వెళ్ళే అన్ని మార్గాలలో భారీ బందోబస్తును ఏర్పాటు చేసిన పోలీసులు ఇక ట్రాఫిక్ ను జాతీయ రహదారిపైకి మళ్లించారు. టిడిపి కార్యకర్తలు జగన్ నివాసం వద్ద ఆందోళనలకు దిగే అవకాశం ఉందని ముందస్తుగా భద్రతా ఏర్పాట్లను చేపట్టిన పోలీసులు వైఎస్ జగన్ ఇంటి వైపు వెళ్లే మార్గాలన్నింటినీ మూసివేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేసి, అడుగడుగునా నిఘా పెట్టారు.
మరోవైపు ఈ క్రమంలో పోలీస్ అధికారులపై టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఏపీ ఐపీఎస్ అధికారుల సంఘం ఖండించింది. ఈ మేరకు ఏపీ ఐపీఎస్ అధికారుల సంఘం కార్యదర్శి ద్వారకా తిరుమలరావు ప్రకటనను విడుదల చేశారు. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఎస్పీ నా కొడుకులు అని సంభోదించడం ఆక్షేపణీయం. వారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గుపడేలా ఉన్నాయి. ప్రజా ప్రతినిధులు హుందాతనంతో, విలువలతో, స్థాయికి తగ్గట్టు వ్యవహరించాల్సిన అవసరం ఎంతయినా ఉందంటూ పేర్కొన్నారు.
ఎన్నో సమస్యల మధ్య విధులు నిర్వహిస్తున్న తమ పట్ల అనుచితంగా వ్యవహరించడం ఎంత వరకు సబబు. ఒక పోలీసు ఉన్నతాధికారిని దూషించడమంటే రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమే. శాంతి భద్రతల పరిరక్షణ కోసం అనునిత్యం శ్రమిస్తున్న పోలీసు వ్యవస్థను తూలనాడడంలో ఔచిత్యం ఏమిటో ఆలోచించుకోవాలి. ఇష్టానుసారం మాట్లాడి వ్యవస్థలను అభాసుపాలు చేయొద్దు. పరిధిని అతిక్రమించి మాట్లాడొద్దు అని విజ్ఞప్తి చేస్తున్నామని తిరుమలరావు పేర్కొన్నారు. మరి ఈ వివాదం ఏ మలుపు తీసుకుంటుందోనన్నదే ఆసక్తికరంగా మారింది.
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.