Ys jagan : ఆ ఎమ్మెల్యేలపై వైఎస్ జగన్ స్పెషల్ ఫోకస్..!
Ys jagan: వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి 2019 సాధారణ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో అధికారంలోకి వచ్చిన సంగతి అందరికీ విదితమే. 2014 సాధారణ ఎన్నికల్లో టీడీపీ చేతిలో ఓటమి పాలయిన జగన్.. తర్వాత ఎన్నికల్లో మాత్రం టీడీపీని ఓడించేశాడు.2019 సాధారణ ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన వారిలో చాలా మంది కొత్త వారికి టికెట్లు ఇవ్వగా దాదాపు 66 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. మొత్తం 175 నియోజకవర్గాల్లోనూ జగన్ దాదాపుగా కొత్త వారికి అవకాశమివ్వడం ఆయనకు అడ్వాంటేజ్‌గా మారిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషించారు. కాగా, కొత్తగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారి పనితీరును ఏపీ సీఎం జగన్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
వారిపై స్పెషల్ ఫోకస్ పెట్టి మరి.. వారి పని తీరుపై నివేదికలు తెప్పించుకుని పరిశీలన చేస్తున్నట్లు సమాచారం. వారి పని తీరు ఆధారంగానే వచ్చే సాధారణ ఎన్నికల్లో వారికి టికెట్లు ఇవ్వాలని జగన్ భావిస్తున్నారని వైసీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇకపోతే ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారిలో వ్యతిరేకత ఉన్న వారికి ఇప్పటికే ఫస్ట్ వార్నింగ్ ఇచ్చినట్లు వినికిడి. చిత్తూరు జిల్లాలో తొలిసారిగా గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజల్లో అసంతృప్తి ఉందని, ముఖ్యమంత్రికి ఫిర్యాదు అందాయని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కొత్తగా ఎన్నకైన ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండకపోవడంతో పాటు సొంత పార్టీ నేతల నుంచి కూడా వ్యతిరేకత ఎదుర్కొంటున్నట్లు పార్టీ అధిష్టానానికి కంప్లయింట్స్ అందినట్లు సమాచారం.
Ys jagan: పని తీరుపై నివేదికలు.. వ్యతిరేకత ఉన్నవారందరికీ వార్నింగ్..!
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన అందరిపై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో వారికి రాజకీయ సమీకరణాలు, పార్టీలో వ్యతిరేకత, అనుకూలతల ఆధారంగా టికెట్లు ఇవ్వాలని జగన్ భావిస్తున్నారట. ఈ క్రమంలోనే ఏపీలోని అన్ని జిల్లాల నుంచి తొలిసారి శాసనసభ్యులుగా ఎన్నికైన వారి పని తీరుపైన జగన్ సమీక్ష చేస్తున్నట్లు వైసీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది.