YS Jagan : లేనిపోని తలనొప్పి పట్టుకొచ్చి వైసీపీ క్యాడర్ నెత్తిన పెట్టిన జగన్?
YS Jagan : అసలు ఏ పార్టీకైనా శాశ్వత అధ్యక్షుడు ఉంటారా? శాశ్వత పదవులు పార్టీలో ఉంటాయా? ఎందుకంటే వైఎస్సార్సీపీ పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా ఉండేందుకు వైఎస్ జగన్ ఎన్నిక చెల్లదు అని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. అదే ఇప్పుడు షాకింగ్ న్యూస్ అయిపోయింది. రాజకీయ పార్టీలకు శాశ్వత అధ్యక్షుడు లేదా శాశ్వత పదవులు వర్తించవు అంటూ ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. ఎందుకంటే.. ఇది డెమోక్రసీ కంట్రీ. ఇక్కడ పార్టీలకు తరుచూ ఎన్నికలు జరుగుతుంటాయి. అందువల్ల ఏ పార్టీకి అయినా శాశ్వత అధ్యక్షుడు లేదా శాశ్వత పదవులు ఉండవని.. అది ప్రజాస్వామ్యానికే వ్యతిరేకం అని ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది.
ఈసమయంలో దీనిపై ఎన్నికల సంఘం స్పందించడానికి కారణం వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా సీఎం జగన్ ఎన్నికైనట్టు వచ్చిన వార్తలపై ఎన్నికల సంఘం స్పందించింది. వైసీపీ ప్రధాన కార్యదర్శికి ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. నియమాలకు విరుద్ధంగా శాశ్వత అధ్యక్షుడిని ఎన్నుకోవడం ఏంటి అంటూ ఈసీ తెలిపింది. వెంటనే అంతర్గత విచారణ జరిపి ఈసీకి నివేదిక అందించాలని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శిని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.
YS Jagan : ఇదంతా జగన్ తెచ్చుకున్న తలనొప్పేనా?
అసలు.. వైసీపీలో శాశ్వత అధ్యక్షుడు ఎందుకు. అవసరమా.. అంటే ఇదంతా జగన్ తలనొప్పి అని తెలుస్తోంది. పార్టీ పెట్టిందే జగన్.. ఆయనే సుపీరియర్. జగన్ మాటకు ఎదురు చెప్పేవాళ్లు ఎవరూ ఉండరు. పార్టీలో ఎలాంటి అంతర్గత పోరు కూడా లేదు. అలాంటప్పుడు ఎందుకు పార్టీకి ప్రత్యేకంగా శాశ్వత అధ్యక్షుడు. పోనీ.. వేరే ఏ పార్టీకి అయినా శాశ్వత అధ్యక్షుడు ఉన్నారా? లేరు కదా.. మరి కేవలం వైసీపీకే శాశ్వత అధ్యక్షుడు ఎందుకు.. ఇది సీఎం జగన్ ఆలోచనేనా.. లేక వేరే నేత ఇచ్చిన ఆలోచనా. అనవసర తలనొప్పులు తెచ్చుకోవడం ఎందుకు. శాశ్వత అధ్యక్షుడి హోదాతో జగన్ కు వచ్చే ఉపయోగం ఏం లేదు. ఇలాంటి సమయంలో ఈసీ నుంచి వైసీపీ ఉత్తర్వులు అందుకోవడం కరెక్టేనా.. ఈ వివాదాన్ని వైసీపీ ఎలా పరిష్కరిస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.