ys jagan : పార్లమెంట్ లో జగన్ పరువు నిలబెట్టండి మహాప్రభో … మీకోక దండం !
ys jagan : ఏపీ అధికార పార్టీ నుండి పార్లమెంట్ కు మొత్తం 22 మంది ఎన్నిక అయ్యారు. వారిలో ఒకరు మృతి చెందగా మరొకరు పార్టీలో ఉన్నారా లేరా అనే విషయం అర్థం కాకుండా ఉంది. ఆయనే నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు. చనిపోయిన ఎంపీ మరియు రఘురామ కృష్ణంరాజులను వదిలేస్తే ఇంకా 20 మంది ఎంపీలు వైకాపా తరపున పార్లమెంట్ లో మాట్లాడేందుకు అవకాశం ఉంది. పార్లమెంట్ అతి పెద్ద పార్టీల జాబితాలో ముందు వరుసలో ఉన్న వైకాపాకు సభాపతి కావాల్సినంత సమయం ఇచ్చే అవకాశం ఉంది. కాని ఏపీ ఎంపీలు మాత్రం సరిగా ఆ సమయంను ఉపయోగించుకోవడం లేదు. అసలు కొన్ని సార్లు సమయాన్ని కూడా కోరేందుకు వైకాపా ఎంపీలు ఆసక్తి చూపడం లేదు అంటూ విమర్శలు వస్తున్నాయి. ఇటీవల కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై వైకాపా ఎంపీలు ఏం మాట్లాడారో కనీసం ఆ పార్టీ నాయకులకు కూడా తెలియడం లేదు.
ys jagan : 20 మంది ఎంపీలు ఉండి ఏం లాభం..
వైకాపాకు చెందిన 20 మంది ఎంపీలు కూడా పార్లమెంట్ లో మౌన ముద్రలో కనిపించడం ఆ పార్టీ నాయకులకు నిరాశ కలిగిస్తుంది. ప్రజల్లో కూడా వారిపై నమ్మకం కలగడం లేదు. వైకాపా నాయకులు కేంద్రం నుండి నిధులు వచ్చే విషయమై ఎంపీలది కీలక పాత్ర ఉంటుందని, ప్రత్యేక హోదాతో పాటు కేంద్రం నుండి రావాల్సినవన్నీ కూడా రాబట్టేందుకు ఎక్కువ మంది ఎంపీలను ఇవ్వాలంటూ వైఎస్ జగన్ ఎన్నికల సందర్బంగా ప్రజలకు విజ్ఞప్తి చేశాడు. ప్రజలు ఏకంగా 22 మంది ఎంపీల బలంను జగన్ కు ఇచ్చారు. కాని ఎంపీలు మాత్రం వైఎస్ జగన్ కు పెద్దగా ప్రయోజనం కలిగేలా చేయడం లేదు.
వైఎస్ జగన్ పరువు తీస్తున్నారు..
సీఎం వైఎస్ జగన్ ఎంతో నమ్మకం పెట్టుకుని పార్లమెంట్ కు వారిని పంపిస్తే వారేమో ఇలా మౌనంగా పార్లమెంట్ కు వెళ్తున్నాం వస్తున్నాం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలో తీవ్రమైన విమర్శలు ఆ పార్టీ నాయకులపై వ్యక్తం అవుతున్నాయి. బడ్జెట్ కేటాయింపులు మొదలుకుని ఏపీ ప్రజల కల అయిన పోలవరం కు కనీస నిధులను తీసుకు రావడంలో విఫలం అవుతున్నారు. పక్క రాష్ట్రాలకు వేల కోట్లు పంపిస్తున్న కేంద్రం ఏపీకి ఇవ్వకుంటే కనీసం ప్రశ్నించకుండా పార్లమెంట్ లో వైఎస్ జగన్ పరువు తీస్తున్నారు. ఏపీలో కూడా వైఎస్ జగన్ గురించి తప్పుగా మాట్లాడుకునేలా వైకాపా ఎంపీలు చేస్తున్నారంటూ స్వయంగా ఆ పార్టీ కి చెందిన కొందరు నేతలు అంటున్నారు.