YS Jagan : వైకాపా జోరు… సీఎం జగన్ సొంత సర్వే ఫలితాలు ఏం చెబుతున్నాయి
YS Jagan : ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు గడువు దగ్గర పడిందా అన్నట్లుగా హడావుడి కనిపిస్తుంది. కొన్ని నెలల నుండే జనసేనాని పవన్ కళ్యాణ్ పొత్తుల కోసం ప్రాకులాడుతూ బీజేపీ మరియు టీడీపీని కలిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయన చేస్తున్న ప్రయత్నాలు సొంత పార్టీలోనే విసుగు తెప్పిస్తున్నాయి అనే విమర్శలు వస్తున్నాయి. మరో వైపు చంద్రబాబు నాయుడు కూడా పొత్తు పెట్టుకోకుంటే గెలవడం సాధ్యం కాదు అనే నిర్ణయానికి వచ్చాడు. ఇక బీజేపీ మాత్రం పొత్తు లేకుండా వెళ్తే ఎలా ఉంటుందా అనే ఒక ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఈ సమయంలో వైకాపా మాత్రం ఫుల్ క్లారిటీగా ఉంది. అధికార వైకాపా జోరు చూస్తుంటే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం అనేది.
ఆ పార్టీకి నల్లేరు మీద నడకే అన్నట్లుగా ఉందంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా వైకాపా సొంత సర్వేను చేయించుకుంది. ఆ సమయంలో చాలా పాజిటివ్ ఫలితాలు వచ్చాయట. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం సందర్బంగా పరిష్కారం అవుతున్న సమస్యలు మరియు ఇతర విషయాల పట్ల చాలా సంతోషంగా జనాలు ఉన్నారని తాజా సర్వే ను బట్టి అర్థం అయ్యిందట. ప్రతి ఇంటి గడప వద్దకు ప్రభుత్వ పథకం వెళ్తుంది. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం ఇలా చేయలేదు అనేది ప్రజల అభిప్రాయం గా తెలుస్తోంది. గతంలో కూడా ప్రభుత్వాలు చాలా పథకాలు తీసుకు వచ్చేవి. కాని వాటిల్లో చాలా పథకాల గురించి కనీసం జనాలకు తెలిసేది కాదు.
కాని ఇప్పుడు వాలంటీర్లు గ్రామంలోని ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ పథకాల గురించి కులంకశంగా వివరిస్తూ ప్రతి ఒక్కరిని ఏదో ఒక ప్రభుత్వ పథకం అమలు అయ్యేలా తమ వంతు కృషి చేస్తున్నారు. పైగా వాలంటీర్ వ్యవస్థ వల్ల ప్రజలు ప్రభుత్వ ఆఫీస్ ల చుట్టు.. బ్యాంకుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా పోయింది. ఇదే సీఎం జగన్ ప్రభుత్వం పై జనాల్లో చాలా సానుకూలత ఉండేలా చేసింది. 2024 లో మీరు ఎవరికి ఓటు వేస్తారు అన్నప్పుడు దాదాపుగా 79.65 శాతం మంది వైకాపా నే మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నామని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సర్వే ఫలితంతో వైకాపా లో జోరు మరింతగా పెరిగింది.