KCR : వైఎస్సార్ గురించి ఇప్పుడు ఎందుకు చర్చకు వచ్చింది అంటారా? దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన విషయం అందరికీ తెలిసిందే. తెలుగు ప్రజలు అందరూ కలిసే ఉండాలని.. రెండు రాష్ట్రాలుగా తెలుగు ప్రజలు విడిపోకూడదని.. ఆయన బతికి ఉన్నసమయంలో చాలాసార్లు స్పష్టం చేశారు. అలాగే.. తెలంగాణ వస్తే ఏమౌతుందో కూడా ఆయన 2009 లోనే చెప్పారు. తెలంగాణ వస్తే.. ఏపీ ప్రజలు పరిస్థితి ఏమౌతుందో కూడా ఆయన ఆనాడే ఊహించగలిగారు. ఇప్పుడు అది నిజం అయింది. దాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ నిజం చేస్తున్నారు.. అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఎందుకంటే.. ప్రస్తుత కరోనా కాలంలో ఏపీలో సరైన సౌకర్యాలు లేక.. మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు ఉన్న హైదరాబాద్ కు ఏపీ ప్రజలు తరలివస్తుంటే.. మధ్యలో తెలంగాణ సరిహద్దు వద్ద.. ఏపీకి చెందిన కరోనా పేషెంట్లను తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. పాస్ లేకుంటే.. తెలంగాణలో అడుగుపెట్టకూడదని.. ఈపాస్ ఉన్నవాళ్లకే తెలంగాణలోకి ఎంట్రీ అని స్పష్టం చేశారు. ఓవైపు కరోనా వచ్చి అల్లాడుతుంటే.. ఈ పాస్ లు పర్మిషన్లు గట్రా ఎక్కడి నుంచి తీసుకొచ్చేదని ఏపీకి చెందిన కరోనా పేషెంట్లు మొత్తుకున్నా.. తెలంగాణ పోలీసులు వినలేదు. దీంతో తెలంగాణ సరిహద్దు వద్దే.. ఏపీకి చెందిన కొందరు కరోనా పేషెంట్లు వైద్యం అందక.. అంబులెన్స్ లోనే మృతి చెందారు. దీనిపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. తెలంగాణ ప్రభుత్వంపై ఏపీ ప్రజలు తిట్టిపోశారు. ఆ తర్వాత.. తెలంగాణ హైకోర్టు.. తెలంగాణ ప్రభుత్వంపై సీరియస్ అవ్వడంతో వెంటనే ఏపీ అంబులెన్స్ లను తెలంగాణలోకి అనుమతించడం ప్రారంభించారు. ఏది ఏమైనా.. ఆ మూడు నాలుగు రోజులు.. ఏపీ ప్రజలు.. సరిహద్దు వద్ద ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు.
అయితే.. 2009 లో వైఎస్సార్.. కర్నూలులో ఎన్నికల ప్రచారంలో.. తెలంగాణ రాష్ట్ర ప్రస్థావన తీసుకొచ్చి.. ఏపీ ప్రజలు తెలంగాణ వెళ్లాలంటే.. తెలంగాణ ప్రభుత్వం.. పాస్ పోర్ట్ అడిగినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.. అని ఆయన అప్పుడే ఊహించి అన్నారు. అది ఇప్పుడు నిజం అయింది. తెలంగాణకే కాదు.. ఏపీకి కూడా హైదరాబాద్ మరో మూడేళ్ల పాటు రాజధాని అనే విషయం కూడా మరిచిపోయి.. తెలంగాణ ప్రభుత్వం.. ఏపీ ప్రజలను సరిహద్దు వద్దే ఆపేయడం తెలంగాణ ప్రభుత్వం అహంకారానికి నిదర్శనం అని ఏపీ ప్రజలతో పాటు ఏపీలోని రాజకీయ పార్టీలన్నీ ముక్తకంఠంతో నినదిస్తున్నాయి.
ఆనాడు వైఎస్సార్ చేసిన వ్యాఖ్యలను నేడు.. సీఎం కేసీఆర్ చేసి చూపిస్తున్నారు అని అంటున్నారు. ఓవైపు కరోనాతో ప్రజలంతా అతలాకుతలం అవుతుంటే.. మీకు పర్మిషన్లు కావాలా? హైదరాబాద్ కు వైద్యం కోసం పోవడానికి కూడా ఇన్ని నిబంధనలా? ఇదేం న్యాయం. ఇదేం ప్రభుత్వం.. ఏపీ ప్రజలను కావాలని ఇన్ని ఇబ్బందులకు కేసీఆర్ ప్రభుత్వం గురిచేసిందని.. ఏపీ ప్రజలు మండిపడుతున్నారు. పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా రాష్ట్రాలు తమ రాష్ట్రాల్లోకి అనుమతిస్తుంటే.. ఒక్క తెలంగాణ మాత్రం ఏపీ ప్రజలపై చిన్న చూపు చూసిందని అంటున్నారు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.