KCR : ఆనాడు వైఎస్సార్ చెప్పిందే నేడు జరిగింది.. తెలంగాణ వస్తే ఏమౌతుందో ముందే ఊహించిన వైఎస్సార్? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

KCR : ఆనాడు వైఎస్సార్ చెప్పిందే నేడు జరిగింది.. తెలంగాణ వస్తే ఏమౌతుందో ముందే ఊహించిన వైఎస్సార్?

 Authored By jagadesh | The Telugu News | Updated on :16 May 2021,8:38 pm

KCR : వైఎస్సార్ గురించి ఇప్పుడు ఎందుకు చర్చకు వచ్చింది అంటారా? దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన విషయం అందరికీ తెలిసిందే. తెలుగు ప్రజలు అందరూ కలిసే ఉండాలని.. రెండు రాష్ట్రాలుగా తెలుగు ప్రజలు విడిపోకూడదని.. ఆయన బతికి ఉన్నసమయంలో చాలాసార్లు స్పష్టం చేశారు. అలాగే.. తెలంగాణ వస్తే ఏమౌతుందో కూడా ఆయన 2009 లోనే చెప్పారు. తెలంగాణ వస్తే.. ఏపీ ప్రజలు పరిస్థితి ఏమౌతుందో కూడా ఆయన ఆనాడే ఊహించగలిగారు. ఇప్పుడు అది నిజం అయింది. దాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ నిజం చేస్తున్నారు.. అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ys rajasekhara reddy versus telangana cm kcr

ys rajasekhara reddy versus telangana cm kcr

ఎందుకంటే.. ప్రస్తుత కరోనా కాలంలో ఏపీలో సరైన సౌకర్యాలు లేక.. మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు ఉన్న హైదరాబాద్ కు ఏపీ ప్రజలు తరలివస్తుంటే.. మధ్యలో తెలంగాణ సరిహద్దు వద్ద.. ఏపీకి చెందిన కరోనా పేషెంట్లను తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. పాస్ లేకుంటే.. తెలంగాణలో అడుగుపెట్టకూడదని.. ఈపాస్ ఉన్నవాళ్లకే తెలంగాణలోకి ఎంట్రీ అని స్పష్టం చేశారు. ఓవైపు కరోనా వచ్చి అల్లాడుతుంటే.. ఈ పాస్ లు పర్మిషన్లు గట్రా ఎక్కడి నుంచి తీసుకొచ్చేదని ఏపీకి చెందిన కరోనా పేషెంట్లు మొత్తుకున్నా.. తెలంగాణ పోలీసులు వినలేదు. దీంతో తెలంగాణ సరిహద్దు వద్దే.. ఏపీకి చెందిన కొందరు కరోనా పేషెంట్లు వైద్యం అందక.. అంబులెన్స్ లోనే మృతి చెందారు. దీనిపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. తెలంగాణ ప్రభుత్వంపై ఏపీ ప్రజలు తిట్టిపోశారు. ఆ తర్వాత.. తెలంగాణ హైకోర్టు.. తెలంగాణ ప్రభుత్వంపై సీరియస్ అవ్వడంతో వెంటనే ఏపీ అంబులెన్స్ లను తెలంగాణలోకి అనుమతించడం ప్రారంభించారు. ఏది ఏమైనా.. ఆ మూడు నాలుగు రోజులు.. ఏపీ ప్రజలు.. సరిహద్దు వద్ద ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు.

KCR : తెలంగాణ వస్తే.. ఏపీ ప్రజలు తెలంగాణ వెళ్లాలంటే.. పాస్ పోర్టు అడుగుతారు

అయితే.. 2009 లో వైఎస్సార్.. కర్నూలులో ఎన్నికల ప్రచారంలో.. తెలంగాణ రాష్ట్ర ప్రస్థావన తీసుకొచ్చి.. ఏపీ ప్రజలు తెలంగాణ వెళ్లాలంటే.. తెలంగాణ ప్రభుత్వం.. పాస్ పోర్ట్ అడిగినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.. అని ఆయన అప్పుడే ఊహించి అన్నారు. అది ఇప్పుడు నిజం అయింది. తెలంగాణకే కాదు.. ఏపీకి కూడా హైదరాబాద్ మరో మూడేళ్ల పాటు రాజధాని అనే విషయం కూడా మరిచిపోయి.. తెలంగాణ ప్రభుత్వం.. ఏపీ ప్రజలను సరిహద్దు వద్దే ఆపేయడం తెలంగాణ ప్రభుత్వం అహంకారానికి నిదర్శనం అని ఏపీ ప్రజలతో పాటు ఏపీలోని రాజకీయ పార్టీలన్నీ ముక్తకంఠంతో నినదిస్తున్నాయి.

ఆనాడు వైఎస్సార్ చేసిన వ్యాఖ్యలను నేడు.. సీఎం కేసీఆర్ చేసి చూపిస్తున్నారు అని అంటున్నారు. ఓవైపు కరోనాతో ప్రజలంతా అతలాకుతలం అవుతుంటే.. మీకు పర్మిషన్లు కావాలా? హైదరాబాద్ కు వైద్యం కోసం పోవడానికి కూడా ఇన్ని నిబంధనలా? ఇదేం న్యాయం.  ఇదేం ప్రభుత్వం.. ఏపీ ప్రజలను కావాలని ఇన్ని ఇబ్బందులకు కేసీఆర్ ప్రభుత్వం గురిచేసిందని.. ఏపీ ప్రజలు మండిపడుతున్నారు. పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా రాష్ట్రాలు తమ రాష్ట్రాల్లోకి అనుమతిస్తుంటే.. ఒక్క తెలంగాణ మాత్రం ఏపీ ప్రజలపై చిన్న చూపు చూసిందని అంటున్నారు.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది