
YS Sharmila : అప్పుడే షర్మిల డ్రామా స్టార్ట్.. అడ్డంగా దొరికిపోయిందిగా..!
YS Sharmila : రాజకీయ నాయకులు పెద్ద నటులు. సినిమాలో నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారు చాలామందే ఉన్నారు. సీనియర్ ఎన్టీఆర్, కృష్ణ, పవన్ కళ్యాణ్, చిరంజీవి ఇలాంటి వాళ్లు తెరమీద నటించిన బయట ఎలా ఉంటారో తెలియదు కానీ రాజకీయాలలో ముందు నుంచి ఉన్న కేసీఆర్, వై. ఎస్. జగన్మోహన్ రెడ్డి , చంద్రబాబు నాయుడు, మోడీ, రాహుల్ గాంధీ వీళ్లంతా అద్భుత నటులు. ఇప్పుడు ఇదే కోవలోకి వై.యస్.షర్మిల దిగారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు అన్న మీద ప్రేమ కారుతున్నట్లు, అన్న పార్టీని కాపాడాలని, కాంగ్రెస్ పార్టీ తన అన్న కెరీర్ను నాశనం చేసిందని వై.యస్.షర్మిల ఒకప్పుడు బాగా నటించారు. ఇప్పుడు కూడా అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను నేను, కాంగ్రెస్ ఏది చెబితే అది చేస్తానని, రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే నా తండ్రి యొక్క కోరిక అని, దానికోసమే కాంగ్రెస్ కు వచ్చాను అని ఆమె చెప్పడం ఆశ్చర్యంగా ఉంది.
తెలంగాణలో వైయస్సార్ టీపీ పార్టీని పెట్టి కాంగ్రెస్ పై విమర్శలు చేసినటువంటి వై.యస్.షర్మిల ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని కొత్త డ్రామా మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్ పై ప్రేమ కారుతున్నట్లు కొత్త డ్రామాకు తెర తీశారు. దీంతో ప్రజలు ఆమెను నమ్మే పరిస్థితి కనబడటం లేదు. రాజకీయ నాయకులు మాటలు మార్చడం సాధారణమే. కానీ ఇప్పుడు షర్మిల అంతకన్నా ఎక్కువగా మాటలు మారుస్తున్నారు. తెలంగాణ ఆడబిడ్డను ఖమ్మంలో పుట్టి పెరిగాను. తెలంగాణకు న్యాయం జరిగే వరకు నిద్రపోను, కాంగ్రెస్ ను సర్వనాశనం చేస్తా అని కబుర్లు చెప్పిన షర్మిల వైఎస్ఆర్ టీపీ ని కాంగ్రెస్లో విలీనం చేసి రేవంత్ రెడ్డికి మద్దతు ఇచ్చి ఆంధ్రప్రదేశ్లోకి చేరారు.
ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ పీసీసీ పగ్గాలు అందుకున్నారు. రాజ్యసభ సీటు కోసం కాంగ్రెస్ తరపున కర్ణాటక నుంచి తెలంగాణ నుంచో ఆమె ఢిల్లీకి వెళ్లి పోతారు. ఇంతకుమించి వై యస్. షర్మిల ఏమీ చేయలేరు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజన చేసి సర్వనాశనం చేసింది. అలాంటి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఏమీ చేయలేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, జనసేన ఉండడంతో కాంగ్రెస్ కు పెద్దగా ఒరిగేది ఏమీ ఉండదు. రాజ్యసభకు వెళ్ళటానికి మాత్రమే తప్ప వై.యస్.షర్మిల ఎమోషనల్ డ్రామా ఏపీలో వర్క్ అవుట్ అయ్యే పరిస్థితి లేదు. తెలంగాణలో వైయస్సార్ టీపీ పార్టీ పెట్టి తెలంగాణ నా సర్వం అని చెప్పిన వై.యస్.షర్మిల ఇప్పుడు కాంగ్రెస్లో చేరి ఆంధ్రప్రదేశ్ నా సర్వం అని చెప్పడం ఆశ్చర్యంగా ఉంది. ఎన్ని మాటలు మార్చిన వైయస్ షర్మిలను ఏపీ ప్రజలు ఆమెను ఆదరిస్తారో లేదో చూడాలి.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.