YS Sharmila : పక్కకెళ్లి ఆడుకోమ్మా… షర్మిలక్క వరుస ట్వీట్లపై సీఎం కేసీఆర్ కామెంట్స్? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YS Sharmila : పక్కకెళ్లి ఆడుకోమ్మా… షర్మిలక్క వరుస ట్వీట్లపై సీఎం కేసీఆర్ కామెంట్స్?

 Authored By jagadesh | The Telugu News | Updated on :13 May 2021,1:59 pm

YS Sharmila : వైఎస్ షర్మిల.. గత నెల క్రితం వరకు కూడా తనే తెలంగాణలో ట్రెండింగ్ టాపిక్. తెలంగాణలో పార్టీ పెడుతున్నానంటూ వైఎస్ షర్మిల ప్రకటించగానే.. తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. తెలంగాణలో రావాల్సింది రాజన్న రాజ్యం అంటూ ఆమె ముందుకు వెళ్తున్నారు. రాజన్న రాజ్యం తేవడం కోసం తన శాయశక్తులా కృషి చేస్తానని షర్మిలమ్మ శపథ చేశారు. పార్టీని పెడుతున్నానంటూ ప్రకటించడం మొదలు.. అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు షర్మిల.

ys sharmila tweets against telangana govt

ys sharmila tweets against telangana govt

షర్మిల తెలంగాణ వ్యాప్తంగా పర్యటించడం.. వైఎస్సార్ అభిమానులను కలుసుకోవడం, ఇతర నేతలను కలిసి.. పార్టీ గురించి వాళ్ల అభిప్రాయాలు తెలుసుకోవడం.. అన్నీ జరిగిపోయాయి. ఇటీవల ఖమ్మంలోనూ వైఎస్ షర్మిల సంకల్ప సభను నిర్వహించారు. ఈ సభకు తన తల్లి విజయమ్మ కూడా హాజరయి.. తన బిడ్డను తెలంగాణ ప్రజలు ఆశీర్వదించాలంటూ కోరారు. ఆ తర్వాత హైదరాబాద్ లో ఉద్యోగ దీక్ష అంటూ ఇందిరా పార్క్ వద్ద ప్రారంభించారు. ఆ తర్వాత లోటస్ పాండ్ వద్ద కూడా రెండు మూడు రోజులు నిరాహార దీక్ష అంటూ నిర్వహించారు. ఇలా.. తెలంగాణలో ఎలాగోలా వార్తల్లో నిలవాలని.. ఎలాగోలా.. ప్రజలు తన గురించి మాట్లాడుకోవాలని.. వైఎస్ షర్మిల బాగానే కష్టపడ్డారు. తెలంగాణ ప్రజలు కూడా తన గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టారు.

YS Sharmila : షర్మిలను సీఎం కేసీఆర్ అస్సలు కన్సిడర్ కూడా చేయడం లేదా?

తెలంగాణ ప్రజల మద్దతును కూడగట్టుకోవడం కోసం వైఎస్ షర్మిల ఏకంగా అధికార పార్టీనే టార్గెట్ చేశారు. సీఎం కేసీఆర్ నే ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఖమ్మం సభలోనూ సీఎం కేసీఆర్ ను నిలదీశారు షర్మిల. ఆ తర్వాత ట్వీట్ల రూపంలోనూ చాలాసార్లు అధికార టీఆర్ఎస్ పార్టీ మీదనే తన ఫోకస్ పెట్టారు షర్మిల. ఆ తర్వాత ఇఫ్పుడు కరోనా సెకండ్ వేవ్ విపరీతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో.. కరోనా నియంత్రణలో ప్రభుత్వం అట్టర్ ప్లాఫ్ అయిందని.. ఆసుపత్రుల్లో సరైన సౌకర్యాలు లేవని షర్మిల ఇప్పటికీ వరుస ట్వీట్లతో అధికార పార్టీని ముప్పుతిప్పలు పెడున్నారు.

YS Sharmila

YS Sharmila

షర్మిల టీఆర్ఎస్ పార్టీని ఇంతలా ఇబ్బంది పెడుతున్నా… ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నా.. అసలు సీఎం కేసీఆర్ మాత్రం షర్మిల విషయంలో నోరు విప్పడం లేదు. అసలు.. తనను టీఆర్ఎస్ పార్టీ నేతలెవ్వరూ లెక్క చేయడం లేదంటూ వార్తలు వస్తున్నాయి. తను ఏం చేసినా.. టీఆర్ఎస్ హైకమాండ్ తో పాటు ప్రభుత్వం కూడా నో కామెంట్ అంటోంది. అస్సలు నోరే విప్పడం లేదు. కరోనా విషయంలో ప్రభుత్వాన్ని రోజూ ట్వీట్ల రూపంలో నిలదీస్తున్నా.. ఒక్కరూ పట్టించుకుంటున్న పాపాన పోవడం లేదు. అసలు.. సీఎం కేసీఆర్ అయితే షర్మిలను కన్సిడర్ కూడా చేయడం లేదని.. తన గురించి ఆలోచించేంత తీరిక కూడా కేసీఆర్ కు లేదని.. తనేదో రాజన్న రాజ్యం తెస్తా.. అని ప్రజలకు మాటిచ్చారు కదా.. చూద్దాం.. ఆమె ఏం చేస్తుందో? అన్న రీతిలో సీఎం కేసీఆర్ కూడా ఉన్నారట. షర్మిల ఇంత తిప్పలు పడుతున్నా.. ప్రభుత్వంపై తన విమర్శల బాణాలను సందిస్తున్నా.. అవి కేసీఆర్ కు గుచ్చుకుంటున్నా.. కేసీఆర్ మాత్రం అస్సలు షర్మిలను పట్టించుకోవడం లేదు. చూద్దాం మరి.. భవిష్యత్తులో కూడా షర్మిలను కేసీఆర్ పట్టించుకోరా అని?

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది