YSR Rythu Bharosa : ఏపీలో రైతుల ఖాతాల్లోకి భరోసా డబ్బులు.. కౌలు రైతులకు కూడా..
YSR Rythu Bharosa : ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రైతులకు శుభవార్త చెప్పారు. వైఎస్సార్ రైతు భరోసా పేరుతో రైతులకు అండగా నిలబడుతున్నారు. పెట్టుబడి సాయంగా అందించే వైఎస్సార్ రైతు భరోసా డబ్బులు ఈ రోజు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. మొదటి విడతగా కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్ సాయంతో కలిపి రైతుల ఖాతాల్లో 7500 రూపాయలు ఇవ్వనున్నారు. ఇందులో కేంద్రం ఇచ్చే రెండు వేల రూపాయలు ఈ నెలాఖరున ఇవ్వనుండగా ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం 5500 రూపాయలను రైతుల అకౌంట్లలో జమ చేయనున్నారు.
దీంతో ఏపీలో ఏటా రైతులకు రూ.13,500 లబ్ది చేకూరనుంది. ఇందులో కేంద్రం యేటా రూ. 6000 ఇవ్వనుండగా మిగతా రూ.7500 జగన్ ప్రభుత్వం అందజేయనుంది. కాగా మొదటి విడత కింద మొత్తానికిఇ 7500 రూపాయలు ఇవ్వనుంది. అలాగే అక్టోబర్ లో రెండో విడతగా నాలుగు వేల రూపాయలు అందించనుంది. అలాగే మూడో విడతగా జనవరిలో మరో రెండు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. పథకం ద్వారా మొదటి విడతగా 50.10 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.3,758 కోట్లు జమకానున్నాయి.
భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులతో పాటు దేవదాయ, అటవీ, వక్ఫ్ వంటి ప్రభుత్వ భూములను సాగు చేస్తున్న కౌలు రైతులకు కూడా ఈ సాయాన్ని అందజేయనున్నారు.ఏపీ సర్కార్ ఈ రోజు(సోమవారం) రూ. 5500 జమ చేయనుండగా.. ఈ నెల 31న పీఎం కిసాన్ నిధి నుంచి మరో 2 వేలు రైతుల ఖాతాల్లో కేంద్రం జమ చేయనుంది. కాగా జగన్ సర్కారు ఈ మూడేళ్లలో రైతులకు దాదాపు రూ.1,10,099.21 కోట్లు అందజేసింది. అయితే ఇచ్చిన హామీకి రూ. 1000 అదనంగా చేర్చి అందజేస్తున్నామని.. అలాగే దేశంలో ఎక్కడా లేని విధంగా కౌలు రైతులకు కూడా భరోసా అందజేస్తున్నామని అన్నారు.