YCP : వైకాపా జిల్లాల కొత్త అధ్యక్షులు వీరే | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

YCP : వైకాపా జిల్లాల కొత్త అధ్యక్షులు వీరే

YCP : 2024 అసెంబ్లీ ఎన్నికలు లక్ష్యంగా వైకాపా ముందస్తు వ్యూహాన్ని అమలు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి నుండే పార్టీ నాయకులను సన్నద్దం చేస్తోంది. ఎమ్మెల్యేలు రాష్ట్రంలోని ప్రతి గడప గడప తిరిగి వైకాపా ప్రభుత్వం చేపట్టిక అభివృద్ది కార్యక్రమాల గురించి వివరించాలంటూ పార్టీ అధినాయకత్వం ఆదేశించారు. మరో వైపు ఇటీవల మంత్రి పదవులు కోల్పోయిన వారికి మరియు సీనియర్ లకు జిల్లాల బాధ్యత ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా నాయకులు ఖచ్చితంగా పర్యటించి […]

 Authored By prabhas | The Telugu News | Updated on :20 April 2022,5:30 pm

YCP : 2024 అసెంబ్లీ ఎన్నికలు లక్ష్యంగా వైకాపా ముందస్తు వ్యూహాన్ని అమలు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి నుండే పార్టీ నాయకులను సన్నద్దం చేస్తోంది. ఎమ్మెల్యేలు రాష్ట్రంలోని ప్రతి గడప గడప తిరిగి వైకాపా ప్రభుత్వం చేపట్టిక అభివృద్ది కార్యక్రమాల గురించి వివరించాలంటూ పార్టీ అధినాయకత్వం ఆదేశించారు. మరో వైపు ఇటీవల మంత్రి పదవులు కోల్పోయిన వారికి మరియు సీనియర్ లకు జిల్లాల బాధ్యత ఇవ్వడం జరిగింది.

రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా నాయకులు ఖచ్చితంగా పర్యటించి అభివృద్ది కార్యక్రమాలకు సంబంధించిన విషయాలను వెళ్లడించాలని.. దేశంలో ఎక్కడ లేని విధంగా వైకాపా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను కూడా అర్థం అయ్యేలా వివరించే విధంగా జిల్లాల అధ్యక్షులను ఎంపిక చేయడం జరిగింది. కొత్త జిల్లాల అధ్యక్షులు ప్రతి ఒక్కరు కూడా ఆయా జిలాల్లో పార్టీ బలోపేతం కోసం ప్రయత్నాలు చేయాల్సిందిగా పార్టీ ఆదేశాలు ఇచ్చింది.

ysrcp apponts 26 leaders as party district presidents

ysrcp apponts 26 leaders as party district-presidents

1. చిత్తూరు : కేఆర్‌జే భరత్
2. అనంతపురం : కాపు రామచంద్రారెడ్డి
3. శ్రీసత్యసాయి : ఎం. శంకర్‌ నారాయణ
4. అన్నమయ్య : గడికోట శ్రీకాంత్‌రెడ్డి
5. కర్నూలు : వై. బాలనాగిరెడ్డి
6. నంద్యాల : కాటసాని రాంభూపాల్‌రెడ్డి
7. వైఎస్సార్‌(కడప) : కే. సురేష్‌ బాబు
8. తిరుపతి : చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
9. నెల్లూరు : వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి
10. ప్రకాశం : బుర్రా మధుసూదన యాదవ్‌
11. బాపట్ల : మోపిదేవి వెంకట రమణ
12. గుంటూరు : మేకతోటి సుచరిత
13. పల్నాడు : పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
14. ఎన్టీఆర్ : వెల్లంపల్లి శ్రీనివాస్‌రావు
15. కృష్ణా : పేర్ని వెంకటరామయ్య( నాని)
16. ఏలూరు : ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌(నాని)
17. పశ్చిమ గోదావరి : చెరుకువాడ శ్రీరంగనాధ రాజు
18. తూర్పు గోదావరి : జగ్గంపూడి రాజ ఇంద్ర వందిత్‌
19. కాకినాడ : కురసాల కన్నబాబు
20. కోనసీమ : పొన్నాడ వెంకట సతీష్‌ కుమార్‌
21. విశాఖపట్నం : ముత్తెంశెట్టి శ్రీనివాసరావు
22. అనకాపల్లి : కరణం ధర్మశ్రీ
23. అల్లూరి సీతారామ రాజు : కొట్టగుల్లి భాగ్యలక్ష్మీ
24. పార్వతీపురం మాన్యం : పాముల పుష్పశ్రీవాణి
25. విజయనగరం : చిన్న శ్రీను
26. శ్రీకాకుళం : ధర్మాన కృష్ణదాస్‌

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది