YSRCP : వైసీపీ కాపు మంత్రులు, ఎమ్మెల్యేల మీటింగ్ – ఏపీలో ప్రకంపనలు..!!
YSRCP : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కాపు సామాజికవర్గం నేతలపై, ప్రజాప్రతినిధులపై ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో వైసీపీ నేతల్లో ఒక్కసారిగా ఉలుకు వచ్చేసింది. దీంతో ఈనెల 31న రాజమండ్రిలో వైసీపీ పార్టీకి చెందిన పలువురు కాపు ఎమ్మెల్యేలు సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. వైసీపీ ఎమ్మెల్యేలే కాదు.. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా ఈ సమావేశంలో హాజరు కానున్నట్టు తెలుస్తోంది. దీంతో ఏపీలో రాజకీయాలు కాస్త వైసీపీ వర్సెస్ జనసేనలా మారిపోయాయి.
చెప్పు చూపిస్తూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను వైసీపీ సీరియస్ గా తీసుకుంది. వైసీపీ కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ అందుకే సమావేశం అవుతున్నట్టు తెలుస్తోంది. వీళ్లంతా రాజమండ్రిలోని ఓ హోటల్ లో భేటీ కానున్నట్టు తెలుస్తోంది. కేవలం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపైనే ఈ సమావేశంలో వాళ్లు చర్చించనున్నట్టు తెలుస్తోంది.
YSRCP : కాపులకు ఇంత సంఖ్యా బలం ఉన్నా.. అధికారం రావడం లేదు
మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్… దాదాపు అన్ని సామాజిక వర్గాలపై విరుచుకుపడ్డారు. బలిజ కులం, కాపు, తెలగ, ఒంటరి లాంటి వర్గాల నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు కాపులకు ఇంత సంఖ్యా బలం ఉన్నా అధికారంలోకి రావడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కాపులపై ఒకేసారి పవన్ కళ్యాణ్ విరుచుకుపడటంతో కాపు నేతలంతా వెంటనే అలర్ట్ అయ్యారు. ఈనెల 31 మీటింగ్ లో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.