YS Jagan : జగన్ బెయిల్ రద్దుపై మరోసారి రచ్చ… కీలకం కానున్న కోర్టు తీర్పు?
YS Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్.. ముఖ్యమంత్రిగా సూపర్ సక్సెస్ అయ్యారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలను తీసుకొచ్చి ఏపీని అభివృద్ధిలో ముందంజలో ఉంచారు. కానీ… సీఎం జగన్ ను వేధిస్తున్న ఒకే ఒక సమస్య ఆయనపై నమోదైన చార్జ్ షీట్లు. అక్రమాస్తుల కేసులో సీఎం జగన్ పై కేసులు నమోదయిన విషయం తెలిసిందే. ఒక ముఖ్యమంత్రిగా ఆ కేసును ఎదుర్కోవడంలో ఎన్నో సమస్యలను అధిగమించాల్సి వస్తోంది జగన్ కు. ఎందుకంటే.. ప్రతిపక్షాలకు జగన్ అక్కడే అలుసవుతున్నారు. ఆయనపై విమర్శలు చేయడానికి ఆయనపై నమోదైన కేసులనే తమ అస్త్రాలుగా వాడుకుంటున్నారు.
అయితే… వైఎస్సార్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక… ఇటీవల జరిగిన ఎన్నికలన్నింటిలో వైసీపీ విజయకేతనం ఎగురవేయడంతో… వైసీపీ నేతల్లో కూడా ఆత్మవిశ్వాసం పెరిగింది. వైసీపీ నేతలు కూడా హుషారు మీద ఉన్నారు. అంత వరకు బాగానే ఉంది కానీ… జగన్ కు తలనొప్పి తెచ్చే విషయం ఇంకోటి ఉంది. అదే తన సొంత పార్టీకి చెందిన ఎంపీ రఘురామకృష్ణంరాజు. ఆయన వల్ల జగన్ కు ఎదురవుతున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు.
YS Jagan : వైఎస్ జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై 27 న వెలువడనున్న తీర్పు
సీఎం జగన్ ముఖ్యమంత్రి అయ్యాక.. ప్రతి శుక్రవారం హైదరాబాద్ లోని సీబీఐ కోర్టుకు హాజరు అవడం కుదరడం లేదని… తనకు ప్రతి శుక్రవారం కోర్టుకు రావడంపై మినహాయింపు ఇవ్వాలని జగన్ బెయిల్ దరఖాస్తు చేసుకోగా… సీబీఐ కోర్టు సీఎం జగన్ కు బెయిల్ మంజూరు చేసింది. అయితే… అక్రమాస్తుల కేసులో ఉన్న జగన్ కు అలా ఎలా బెయిల్ ఇస్తారు అంటూ ఎంపీ రఘురామ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జగన్ కు వచ్చిన బెయిల్ ను రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో చేసిన పిటిషన్ పై విచారణ జరుగుతోంది.
రఘురామకృష్ణంరాజు పిటిషన్ పై కోర్టులో వాదనలు జరగగా.. కోర్టు కూడా ఆ పిటిషన్ పై సీరియస్ అయింది. ఇప్పటికే ఓసారి ఆ పిటిషన్ ను వెనక్కి పంపించగా… మరోసారి రఘురామ పిటిషన్ దాఖలు చేశారు. దానిపై కోర్టు అసలు ఈ పిటిషన్ ను విచారించాలా? వద్దా? అనే దానిపై ఈనెల 27 న నిర్ణయం తీసుకోనుంది. అయితే… 27న కోర్టు ఏ తీర్పు చెబుతుందా? అని అంతా వేచి చూస్తున్నారు. ఏది ఏమైనా… ప్రతిపక్ష పార్టీల నుంచి కాకుండా… సొంత పార్టీ నేత నుంచి జగన్ కు ఇటువంటి సమస్యలు రావడంతో జగన్ కూడా ఈ విషయంలో ఎక్కువ టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది.