Ysrcp : చుక్కెదుర్లు కాకుండా.. చక్కగా నిర్ణయాలు తీసుకోలేరా..?
Ysrcp : ప్రభుత్వం అనేది పెద్ద వ్యవస్థ. బాగా చదువుకున్నవాళ్లు, పరిపాలనలో అపార అనుభవం గలవాళ్లు, ప్రజల నాడి తెలిసినవాళ్లు, కోర్టుల గత తీర్పుల గురించి క్షుణ్ణంగా ఎరిగినవాళ్లు.. ఇలా ఎందరో ఉంటారు. జనం ఎన్నుకున్న నేతల్లోని ప్రతిభావంతుల్నే కేబినెట్ లోకి తీసుకుంటారు. ముఖ్యమంత్రికి ఎలాగూ దాదాపు అన్ని విషయాల పైన అవగాహన ఉంటుంది. ఏదైనా డౌటొస్తే తీర్చటానికి నిపుణులు, మంచి ఆలోచనలు ఇవ్వటానికి సలహాదార్లు వీరికి అదనం. దాదాపు అన్ని రాష్ట్ర సర్కార్లలోనూ ఇలాంటి సిస్టమే ఉంటుంది. అయినా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నిర్ణయాలే ఎక్కువ శాతం న్యాయస్థానాల్లో తిరస్కరణకు గురవుతున్నాయనిపిస్తోంది. దీంతో ఏపీలోనే ఎందుకిలా జరుగుతోందనే చర్చ నడుస్తోంది.
Ysrcp పార్టీ లాగే.. ప్రభుత్వం కూడా..
మన దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఇప్పుడు ప్రాంతీయ పార్టీలే అధికారంలో ఉన్నాయి. రీజనల్ పార్టీలు చాలా వరకు ఒక వ్యక్తి కేంద్రంగానే ఉన్నాయి. అంటే అతను ఏది చెబితే అదే ఫైనల్. ప్రశ్నించటానికి ఆస్కారం ఉండదు. పార్టీని గెలిపించేది కూడా ఆ ఒక్క వ్యక్తే కాబట్టి ఎమ్మెల్యేలెవరూ, కేబినెట్ మంత్రులెవరూ పార్టీ అధ్యక్షుడితో, ముఖ్యమంత్రితో విభేదించటానికి వీలుండదు. ఒక వేళ రెండో మాట మాట్లాడినా తెల్లారి నుంచే అతనిపై రెబల్ ముద్ర వేస్తారు. ఏపీలో కూడా సేమ్ ఇదే పరిస్థితి నెలకొంది. పార్టీ లీడర్ల మాదిరిగానే ప్రభుత్వాధికారులు కూడా సైలెంటుగా కేబినెట్, ముఖ్యమంత్రి ఏది చెబితే అదే చేసుకుంటూ పోతున్నారు. సొంతగా ఆలోచించి తప్పొప్పులను పట్టిచూపటానికి ఛాన్స్ ఉండట్లేదు. ఫలితంగా మెజారిటీ ప్రభుత్వ నిర్ణయాలకి కోర్టుల్లో చుక్కెదుర్లు అవుతున్నాయి.
Ysrcp క్రెడిట్ అయినా.. డెబిట్ అయినా.. సీఎందే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అటు తన పార్టీ వైఎస్సార్సీపీ Ysrcp ప్రజాప్రతినిధులతోను, ఇటు ప్రభుత్వ అధికారులతోనూ క్లోజ్ గానే ఉంటారని అంటుంటారు. సీఎం వైఎస్ జగన్.. వయసులో తనకన్నా పెద్దవాళ్లను అన్నా అని, చిన్నవాళ్లను పేరు పెట్టి ఆప్యాయంగా పిలుస్తారని చెబుతుంటారు. అంత స్వేచ్ఛాపూరిత వాతావరణం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాల్లోని లోపాలను నిజాయితీగా, నిర్భయంగా వెల్లడించాల్సిన బాధ్యత అందరికీ ఉంటుంది. అయినా ఎవరూ ఎందుకు మాట్లాడట్లేదు. క్రెడిట్ అయినా.. డెబిట్ అయినా.. సీఎంకే ఇచ్చేద్దాం అనేంత అభిమానమా?. లేక.. ధైర్యం చేయలేనంత భయమా?. ఇంత పెద్ద కుటుంబంలో మంచీ చెడు మొత్తం భారం ముఖ్యమంత్రిపైనే వేయటం భావ్యమా?.. సీఎం సహా అందరూ ఆలోచించాల్సిన తరుణమిది. మూడో ఏట అడుగుపెట్టిన వేళ ఇకపై న్యాయస్థానాల్లో ఇలాంటి ఎదురుదెబ్బలు తగలనివిధంగా చక్కని నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తూ..