Ysrcp : సంస్థాగ‌త ఎన్నిక‌ల‌పై సైలెంట్ అయిన జ‌గ‌న్‌.. రీజ‌న్ ఏంటి..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ysrcp : సంస్థాగ‌త ఎన్నిక‌ల‌పై సైలెంట్ అయిన జ‌గ‌న్‌.. రీజ‌న్ ఏంటి..?

 Authored By mallesh | The Telugu News | Updated on :27 October 2021,3:50 pm

Ysrcp : అనేక మంది అంచనాలను తారు మారు చేస్తూ 2019లో ఏపీలో వైఎస్సార్ సీపీ అధికారాన్ని కైవసం చేసుకుంది. వైసీపీ అధికారంలో ఉందంటే ఇప్పటికీ నమ్మని వారున్నారంటే అతిశయోక్తి కాదు. అధికారం చేజిక్కించుకున్న తర్వాత వైసీపీ ఎటువంటి కార్యక్రమాలు చేసింది. ఎన్ని సార్లు కోర్టులకెళ్లింది అనే విషయాన్ని పక్కన పెడితే వైసీపీ మాత్రం అధికారంలో ఉందనేది ఎవరూ కాదనలేని వాస్తవం. ఇక వైఎస్సార్ సీపీ పార్టీ సంస్థాగత విషయాలను గురించి మాట్లాడుకుంటే 2019 ఎన్నికలకు ముందు సంస్థాగత ఎన్నికలు నిర్వహించారు. గౌరవ అధ్యక్షురాలిగా విజయమ్మ, అధ్యక్షుడిగా జగన్ నియామకమయ్యారు.

Ysrcp

Ysrcp

పార్టీ ప్లీనరీ జరిగి దాదాపు ఐదేళ్లు గడుస్తున్నా కానీ మళ్లీ దాని గురించి ఎటువంటి ఊసు లేదు. పార్టీ అధికారంలోకి వచ్చిన నుంచి ప్లీనరీ గురించి పట్టించుకునే వారే కరువయ్యారని అనేక మంది ఆరోపిస్తున్నారు.అసలు పార్టీ కార్యవర్గ ఎన్నికలను నిర్వహిస్తారా? లేదా అనే అనుమానం చాలా మందిలో కలుగుతోంది. దీనికి వైసీపీ శ్రేణులు కూడా సరిగ్గా ఆన్సర్ చేయడం లేదు. ఒక వేళ పార్టీ సంస్థాగత ఎన్నికలు నియమించడం లేదని కొందరు కోర్టును ఆశ్రయించే ప్రమాదం ఉంది. రూల్ ప్రకారం ప్రతి రెండోళ్లకోసారి పార్టీలో సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలి. కానీ వైసీపీలో సంస్థాగత ఎన్నికలు జరిగి దాదాపు ఐదేళ్లవుతోంది. దీంతో వెంటనే సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఒక వేళ సంస్థాగత ఎన్నికలు నిర్వహిస్తే తాను కూడా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని వైసీపీ రెబల్ ఎంపీ రఘరామ తెలిపారు.

Ysrcp : అసలు నిర్వహిస్తారా?

Ys jagan

Ys jagan

మంత్రి వర్గ విస్తరణ జరిగిన తర్వాత సంస్థాగత ఎన్నికలను నిర్వహించాలని వైసీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఉదాహరణగా తీసుకుంటే అక్కడ 2017 నుంచి అనేక సార్లు పార్టీ ప్లీనరీ మీటింగ్ లు జరిగాయి. ఎన్నికలు జరిపి మరీ పార్టీ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మరి వైసీపీ సంస్థాగత ఎన్నికలను ఎప్పుడు నిర్వహిస్తుందో వేచి చూడాలి? సంస్థాగత ఎన్నికలను నిర్వహిస్తుందో? లేక ఎవరైనా కోర్టు గడపే తొక్కాల్సి వస్తుందో?

Advertisement
WhatsApp Group Join Now

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది