YSRCP : అధికారంలో ఉన్న పార్టీకి అక్కడ ఎంపీ అభ్యర్థే దొరకడం లేదా..? వైసీపీ పార్టీకే ఇది మాయని మచ్చ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YSRCP : అధికారంలో ఉన్న పార్టీకి అక్కడ ఎంపీ అభ్యర్థే దొరకడం లేదా..? వైసీపీ పార్టీకే ఇది మాయని మచ్చ?

 Authored By sukanya | The Telugu News | Updated on :5 September 2021,7:00 am

శ్రీకాకుళం : వైసీపీ ఏపీలో అధికారంలో ఉన్న పార్టీ. మూడు దశాబ్దాల పాటు తాను ఏపీకి సీఎం గా ఉంటాను అని వైఎస్ జగన్ గట్టిగా ప్రకటించుకున్న పార్టీ. ఇక 2019 ఎన్నికలలో బంపర్ మెజారిటీతో గెలిచి ప్రత్యర్ధుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తిన వైసీపీకి ఏపీలో కొన్ని చోట్ల ఇంకా అభ్యర్ధుల కొరత ఉందా అంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. ఏదో చిన్న పార్టీలకు ఇలాంటి సమస్యలు ఉండవచ్చు. కానీ ఇప్పటికి పదేళ్ళకు పైగా పార్టీ ప్రస్థానం, ఎన్నో ఎన్నికలను చూసిన అనుభవం కలిగిన వైసీపీకి క్యాండిడేట్లు దొరకరు అంటే షాక్ తినాల్సిందే. శ్రీకాకుళం అంటేనే తెలుగుదేశానికి కంచుకోట.

అలాంటి జిల్లాలో వైసీపీ పది ఎమ్మెల్యే సీట్లకు ఏకంగా ఎనిమిది గెలవడం అద్భుతం. అయితే శ్రీకాకుళం ఎంపీ సీటు వద్దకు వచ్చేసరికి మాత్రం రివర్స్ అయింది. జగన్ సునామీలో కూడా ఈ సీటు దక్కకపోవడం అంటే కచ్చితంగా అది ఫెయిల్యూర్ కిందనే లెక్క. దానికి మించి అక్కడ టీడీపీ స్ట్రాంగ్ అని కూడా చెప్పాలి. అలాంటి సీటులో ఇపుడు వైసీపీ నానా అగచాట్లూ పడుతోంది. ఎమ్మెల్యేల వరకూ ఓకే. కానీ ఎంపీ సీటు వద్దకు వచ్చేసరికి మాత్రం ఎవరూ బాధ్యత స్వీకరించడంలేదు. జగన్ ఎంతలా ఈ జిల్లా మీద దృష్టి పెట్టినా కూడా ఈ వ్యవహారం సెట్ అవడంలేదు.

Ysrcp

Ysrcp

దూసుకొచ్చిన రామ్మోహన్ నాయుడు.. Ysrcp

దాదాపు పదేళ్ల క్రితం వరకూ కింజరాపు రామ్మోహననాయుడు అంటే ఎవరికీ తెలియదు. ఆయన తండ్రి ఎర్రన్నాయుడు, బాబాయ్ అచ్చెన్నాయుడు మాత్రమే జిల్లా వాసులకు పరిచయం. కానీ తండ్రి దుర్మరణం తరువాత దూసుకు వచ్చిన రామ్మోహన్ ఎంతో అనుభవం కలిగిన నేత మాదిరిగా జిల్లా రాజకీయాల్లో పట్టు సాధించారు. ఆయన రెండుసార్లు ఎంపీగా అయ్యారు. మరిన్ని సార్లు గెలిచేలా ఈ సీటుని మార్చుకున్నారు.

రామ్మోహన్ ఉంటే పోటీ చేసిన వేస్ట్ అని వైసీపీ నాయకులు భావిస్తున్నారు అంటే కచ్చితంగా వైసీపీ బలహీనతగానే చెప్పుకోవాలి. మరో వైపు ఏకంగా వైసీపీ బడా నాయకులు దిగినా గెలుపు టీడీపీదే అంటూ తమ్ముళ్ళు ఇక్కడ జబ్బలు చరుస్తున్నారు. దానికి రామ్మోహన్ డైనమిక్ లీడర్ షిప్ అతి ముఖ్య కారణంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో ముచ్చటగా మూడవసారి ఈ సీటు నుంచి వైసీపీ పోటీ చేస్తుంది. కానీ గెలుపు మాత్రం కష్టమే అన్న మాట సొంత పార్టీ వారి నుంచే వినిపిస్తోంది. అందుకే ఎవరికి వారు జాగ్రత్తగా సర్దుకుంటున్నారు. 2019 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసిన దువ్వాడ శ్రీను ఎమ్మెల్సీ అయిపోయారు. వచ్చే ఎన్నికల్లో టెక్కలి నుంచి ఎమ్మెల్యేగా పోటీకి తయారుగా ఉన్నారు.

పోటీకి వెనుకంజ.. Ysrcp 

2009 ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి కాంగ్రెస్ తరఫున ఎంపీగా పోటీ చేసి గెలిచిన కిల్లి కృపారాణి కూడా తాను పోటీకి నో అంటున్నారు. తండ్రిని ఓడించిన ఆమె కొడుకు విషయంలో ఎందుకో తటపటాయిస్తున్నారు. తనకు రాజ్యసభ సీటు ఇస్తే చాలు అనుకుంటున్నారు. ఇక 2014 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓడిన రెడ్డి శాంతి ఇపుడు పాతపట్నం ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ ఆమె గ్రాఫ్ డౌన్ లో ఉంది. దాంతో ఆమెని పోటీకి పెట్టినా ఓటమి ముంచే ఖాయమని అంటున్నారు. వీరే కాదు, బడా నాయకులు అయిన ధర్మాన ప్రసాదరావు నుంచి చాలా మంది ఎంపీ సీటు వద్దు పోటీ వద్దు అంటున్నారు. ఇక రంగంలోకి దింపాలని స్పీకర్ తమ్మినేని కుమారుడు చిరంజీవి నాగ్ సైతం ఆముదాలవలసపైనే దృష్టి పెడుతున్నారు. దీంతో ఈ స్థానంలో పోటీకి వైసీపీకి సరైన అభ్యర్థే దొరకడం లేదని టాక్ వినిపిస్తోంది.

Advertisement
WhatsApp Group Join Now

sukanya

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది