Kuppam : ఎందుకు వైసీపీ.. కుప్పంను టార్గెట్ చేసింది? చంద్రబాబుకు చెక్ పెట్టడంలో వైసీపీ సూపర్ సక్సెస్? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Kuppam : ఎందుకు వైసీపీ.. కుప్పంను టార్గెట్ చేసింది? చంద్రబాబుకు చెక్ పెట్టడంలో వైసీపీ సూపర్ సక్సెస్?

 Authored By sukanya | The Telugu News | Updated on :22 September 2021,3:00 pm

Kuppam కుప్పం .. చంద్రబాబు సొంత నియోజకవర్గం. అక్కడ నుంచి వరుసగా ఏడుసార్లు గెలిచారు. కనీసం నామినేషన్ వేయడానికి కూడా వెళ్లకుండానే బాబు గెలిచేస్తున్నారు.. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ఇటీవల జరుగుతున్న పరిణామాలు కుప్పం కోటకు బీటలు అనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి 2రౌండ్లు చంద్రబాబు వెనుకబడటం అప్పట్లో సంచలనం అయ్యింది. ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారులు ఘోరంగా ఓడిపోయారు. నియోజకవర్గంలోని 89 పంచాయతీల్లో 74 చోట్ల వైసీపీ గెలిస్తే, 14 పంచాయతీలతో టీడీపీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పరిషత్ ఎన్నికలను టీడీపీ బాయికాట్ చేసింది. కొన్నిచోట్ల మాత్రం స్థానిక నేతలు పోటీకి దిగారు. కుప్పంలోనూ అదే జరిగింది. నియోజకవర్గంలోని 66 ఎంపీటీసీ స్థానాలలో 44 చోట్ల టీడీపీ అభ్యర్ధులు బరిలోకి దిగారు. వీరిలో ముగ్గురు మాత్రమే గెలిచారు. నాలుగు జడ్పీటీసీలలో అయితే టీడీపీ పోటీకి కూడా ముందుకు రాలేదు. ఇదే ఇప్పుడు అంతటా చర్చనీయాంశం అయ్యింది.

Ysrcp

Ysrcp

వైసీపీ ప్రత్యేక దృష్టి.. Kuppam

అధికారంలోకి వచ్చాక కుప్పంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది వైసీపీ. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలో అక్కడ వైసీపీ శ్రేణులు పక్కడ్బందీగా పని చేస్తున్నాయి. రాష్ట్రంలో కంటే ముందు కుప్పంలో చంద్రబాబుకు నిలవడనీడ లేకుండా చేయడానికి పెద్దిరెడ్డి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు. టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలను ప్రోత్సహించడం, ప్రభుత్వ పథకాల విషయంలో కాస్త లిబరల్ గా వ్యవహరించడం ద్వారా టీడీపీని బలహీనం చేసే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు పెద్దిరెడ్డి. స్థానికంగా టీడీపీ నేతలపై ఆకర్ష్ అమలు చేయడంలో పెద్దిరెడ్డి సక్సెస్ అయ్యారు. స్థానిక ఎన్నికల్లో టీడీపీకి వ్యతిరేకంగా ఫలితాలు రావడానికి ఈ ఎఫెక్టే కారణమనే అభిప్రాయమూ ఉంది.

చేజేతులారా.. Kuppam

Chandrababu

Chandrababu

ఇక టీడీపీ అంతర్గత విషయాలకు వస్తే, పార్టీ పరిస్థితికి కుప్పం తమ్ముళ్లదే తప్పన్నట్టు చంద్రబాబు మాట్లాడటాన్ని కేడర్ జీర్ణించుకోలేకపోతోందట. నియోజవర్గంలో చంద్రబాబు ప్రతినిధులుగా ఉన్న మనోహర్, ఎమ్మెల్సీ గౌరివాని శ్రీనివాసులుపై కేడర్ పెద్దఎత్తున ఆరోపణలు చేసింది. మనోహర్ ను తొలగించాలని చంద్రబాబు ముందే కార్యకర్తలు పట్టుబట్టినట్టు సమాచారం. అయినా చంద్రబాబు పట్టించుకోలేదు. అయితే.. ఇది ఈ ఎన్నికల వరకే పరిమితం అవుతుందా? లేక వచ్చే సాధారణ ఎన్నికల వరకు ఉంటుందా? అనే చర్చ నియోజకవర్గంలో నడుస్తోంది. ఎన్నికలను బహిష్కరించకుండా టీడీపీ బరిలోకి దిగితే కుప్పంలో ఫలితాలు ఎలా ఉండేవో ఏమో కానీ పార్టీ తరఫున అంటూ పోటీ చేసిన 44 మంది ఎంపీటీసీ అభ్యర్ధులు ఓడిపోవడం.. చంద్రబాబును పునరాలోచనలో పడేలా చేసిందట.

Advertisement
WhatsApp Group Join Now

sukanya

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది