Zodiac Story : అమెరికానే ఉచ్చ పోయించిన సైకో కిల్లర్.. పోలీసులకు ఇంకా సవాల్ గానే మారాడు ..!!
Zodiac Story : అమెరికాలో నేరచరిత్ర చాలా ఎక్కువ అని అందరికీ తెలుసు. అక్కడ ఉండే అమెరికా పౌరులకు గన్ లైసెన్స్ ద్వారా తుపాకులు తమ వద్దే పెట్టుకుంటారు. దీంతో అమెరికాలో గన్ కల్చర్ పై ప్రపంచవ్యాప్తంగా తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. గత కొద్ది సంవత్సరాలుగా అమెరికాలో విచక్షణ రహితంగా కాల్పులు ఘటనలు ఎక్కువైపోతున్నాయి. ఇదిలా ఉంటే 1969వ సంవత్సరంలో జోడియక్ అనే ఒక సైకో కిల్లర్… అమెరికా పోలీసులకు ఇంటెలిజెన్స్.. అధికారులకు ఆర్మీకి కూడా కంటిమీద కునుకు లేకుండా వరుస హత్య ఘటనలతో హోరెత్తించాడు. పోలీసులకు మీడియా ప్రతినిధులకు లెటర్లు రాసి..దమ్ముంటే పట్టుకోండి అనీ హత్యలు చేస్తున్నట్లు చెబుతూ చెప్పి మరి చంపేవాడు. దీంతో అమెరికా మీడియాలో పేపర్లలో జోడియక్ అనే హంతకుడి పేరు వైరల్ అయ్యేది.
అతని పట్టుకోవడానికి అమెరికా పోలీసులు రకరకాల ప్రయత్నాలు చేయడం జరిగింది. అయినా ఎక్కడ దొరకేవాడు కాదు. ఈ క్రమంలో అతడు రాసిన లెటర్లను డికోడ్ చేసి.. పరిశోధనలు చేయగా ఆర్ధర్ అనే వ్యక్తి లెటర్ రైటింగ్ తో సూట్ అయింది. ఆ ఆర్డర్ భార్యతో గొడవ అయ్యి వేరుగా ఓ ఇంటిలో ఉంటూ ఉన్నాడు. అతని ఇల్లు మొత్తం బూజు పట్టి రకరకాల దుర్వాసనతో పాటు… బూతు బంగ్లా గా ఉండేది. పైగా అతడు అమెరికా ఎయిర్ ఫోర్సులో పనిచేసిన ఉద్యోగి. అదే సమయంలో అతనికి నేరచరిత్ర కూడా ఉంది. దీంతో ఆర్డర్ చేతిరాతను పరిశీలించారు. జోడియాక్ రాసిన లెటర్…కీ దగ్గరగా ఉండేది. కానీ కొన్ని అక్షరాలు సూట్ కాకపోవటంతో అతని వదిలేయడం జరిగింది. ఇదిలా ఉంటే జోడియాక్ ఒకసారి ఒకతని చంపుతామని ప్రయత్నం చేస్తూ ఉండగా ఆల్మోస్ట్ అతని చంపే క్రమంలో ఒక్కసారిగా
ఆ ప్రాంతంలోకి కారు రావటంతో జోడియాక్ తప్పించుకుని పారిపోతడు. దీంతో బాధితుడు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకునీ పోలీసుల వద్దకు వెళ్ళడం జరుగుద్ది. పోలీసులు హంతకుడు బాధితుడు చెప్పినట్లు ఛాయాచిత్రం గీయడం జరుగుద్ది. కానీ అది సరిగ్గా… ఎవరి ముఖం సూట్ కాలేదు. దాదాపు 40 సంవత్సరాలు పాటు జోడియాక్ నీ పట్టుకోవడానికి.. ఇన్వెస్టికేటర్లు.. అమెరికా ఆర్మీ… అమెరికా ఇంటెలిజెన్స్ FBI.. చాలామందినీ అనుమానించి విచారణ చేయగా అన్నీ కూడా.. ఫెయిల్ అయిపోతయి. అయితే 40 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈ లెటర్ లను డికోడ్ చేయడం జరుగుద్ది. ఇదే సమయంలో పోలీసులు కూడా మరో వ్యక్తిని జోడియాక్ కిల్లర్ గా అనుమానిస్తూ ఉన్నారు. అతనే గ్యారి ఫ్రాన్సిస్ బొస్త్. దీంతో 40 మంది ప్రవేట్ ఇన్వెస్టిగేటర్స్.., అప్పట్లో తప్పించుకున్న బాధితుడు చెప్పిన ఛాయాచిత్రం గ్యారీ ఫోటో..
చూడగా ఇద్దరు ఒకటేనని డిసైడ్ అయ్యారు. 40 సంవత్సరాల క్రితం గీసిన స్కెచ్ కి సరిగ్గా గ్యారీ ముఖం 90% సెట్ అయిపోయింది. గ్యారీ అనే హంతకుడు కుర్ర వయసు నుండి నేరచరిత్ర కలిగిన వ్యక్తి. అతను నేరాలు చేయటం మాత్రమే కాదు తనతో పాటు చిన్నారులకు తుపాకు అందించి… వాళ్ల చేత దోపిడీలు చేయించేవాడు. గ్యాంగ్ లు నడిపేవాడు. ఆ తర్వాత గ్యారీ అరెస్టు అయ్యి జైలుకు వెళ్లొచ్చి.. నేరాలను పూర్తిగా వదిలేశాడు. ఓ అమ్మాయి ప్రేమలో కూడా పడటం జరిగింది. ఈ క్రమంలో జోడియక్ గురించి గ్యారీ స్నేహితుడి విని… అతను నువ్వే అని గొడవ పెట్టుకోవడంతో స్నేహితుడిని కూడా అతడు చంపినట్లు తాజా పరిశోధనలో తేలింది. ఈ క్రమంలో గ్యారీ యే… జోడియాక్ అనే నిర్ధారణకు వస్తున్న సమయంలో 2018లో గ్యారీ మరణించడం జరుగుద్ది. దీంతో జోడియాక్ కిల్లర్ అతనా కాదా అన్నది సస్పెన్స్ గా మిగిలిపోయింది.