775 Crore Assets : రాజ్యసభ సభ్యురాలు సుధా మూర్తి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు.. సుధా మూర్తి తన సింప్లిసిటీకి, సామాజిక సేవతోనే పేరు తెచ్చుకున్నారు. ఇటీవల సుధా మూర్తి ఓ ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు. సుధా మూర్తి గత 30 ఏళ్లుగా చీర కొనలేదు. ఈ విషయాన్ని సుధా మూర్తి స్వయంగా చెప్పారు. అంతే కాదు దానికి కారణం ఏమిటో కూడా చెప్పారామె. సుధా మూర్తి విద్యావేత్త, రచయిత్రి మాత్రమే కాదు .. సేవా కార్యక్రమాలతో ఎంతో మందికి సహాయం చేస్తున్న మహిళామూర్తి. 2006లో సుధామూర్తికి పద్మశ్రీ పురస్కారం కూడా లభించింది. సుధా మూర్తి సింప్లిసిటీ అందరం చూశాం. తాజాగా ఆమె ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు సాధారణ మహిళగా వచ్చి, మరోసారి వార్తల్లో నిలిచారు.
ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్, 150కి పైగా ప్రచురిత పుస్తకాల రచయిత్రి సుధా మూర్తి చాలా మంది అమ్మాయిలను ఇంజినీరింగ్‌లో రాణించేలా ప్రేరేపించారు. తాజాగా సుధా మూర్తి కుంభమేళాలో ప్రత్యక్షం అయ్యారు. కుంభమేళాకు వచ్చిన సుధా మూర్తి ఒక చిన్న బ్యాగ్ మాత్రమే తీసుకెళ్తూ కనిపించారు. అది కూడా భుజానికి తగిలించుకునేది. ఎలాంటి హడావుడి లేకుండా ఆమె అందరిలో ఒకరిలా కుంభమేళాలు వచ్చి పుణ్యస్నానం చేశారు. ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ రంగంలో దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్‌కి ఆమె అసోసియేట్ అయినప్పటికీ సామాజిక సేవలో రచయిత్రిగా ఆమె సాధించిన విజయాలు అసమానమైనవి. ప్రస్తుతం సుధామూర్తి సింప్లిసిటీకి సంబంధించి నలుగురు మెచ్చుకుంటున్నారు.
ధనమే సర్వస్వం కాదని, జీవితంలో ఆదర్శాలు, సరళత, సహాయమే శాశ్వతమని నమ్మిన వారు సుధామూర్తి. ఈ సింప్లిసిటీ వల్లనే ఇప్పటికీ సుధా మూర్తిని జనాలు ప్రత్యేకంగా చర్చించుకుంటారు. ముఖ్యంగా సుధా మూర్తికి షాపింగ్ అంటే చాలా ఇష్టం. నాకు చీర అంటే చాలా ఇష్టం. అయితే ఇప్పుడు చీర కొనకుండానే దాదాపు 3 దశాబ్దాలు గడిచిపోయాయి.అంటే 30ఏళ్లు గడిచాయని చెప్పారు. కోట్ల ఆస్తి ఉన్నప్పటికీ సుధా మూర్తి ప్రస్తుతం సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు.కారణం ఏంటి? సుధా మూర్తికి సనాతన ధర్మంపై నమ్మకం ఎక్కువ. ఈ నమ్మకమే సుధా మూర్తి నేటికీ చీర కొనకపోవడానికి కారణం.సుధా మూర్తి ఒకసారి పవిత్ర కాశీని సందర్శించారు. అక్కడ విశ్వాసాల ప్రకారం అక్కడికి వెళ్ళేవారు తమకు ఇష్టమైన ఒక వస్తువును వదిలివేయాలి. అలాగే సుధా మూర్తికి చీరలంటే ఇష్టం. నేటికీ ఆ తర్వాత సుధా మూర్తి చీరలు కొనుక్కోవడం ఆపేశారు.
Pragya Jaiswal అఖండ బ్యూటీ ప్రగ్యా జైశ్వాల్ ఈమధ్యనే బాలకృష్ణ డాకు మహారాజ్ Pragya Jaiswal సినిమాతో సర్ ప్రైజ్…
Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ Ram charan గేమ్ ఛేంజర్ Game Changer రిజల్ట్ తో…
Sai Dharam Tej : మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి మొదలు కాబోతుందా.. మెగాస్టార్ రంగంలోకి దిగడంతో నిన్నటిదాకా సమస్యగా…
Peerzadiguda : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ Peerzadiguda పరిధిలో చెత్త సేకరణను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఐటీసీ సంస్థ సహకారంతో…
Minister Seethakka : ఘనంగా మేడిపల్లి ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ 2025 డైరీ ఆవిష్కరణ కార్యక్రమం...ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి సీతక్క,టీపీసీసీ…
HCL Jobs : ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ హెచ్‌సీఎల్ టెక్ (HCL Technologies Limited) హైదరాబాద్‌లో Hyderabad కొత్త…
Nara Lokesh : ఏపీలో డిప్యూటీ సీఎం వివాదం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని…
Income Tax : బడ్జెట్ టైం వచ్చిందంటే కొందరికి గుండెల్లో రైళ్లు పరుగెత్తడం ఖాయం. బడ్జెట్‌లో వేటి రేట్లు పెరుగుతాయి,…
This website uses cookies.