775 Crore Assets : అన్నివేల కోట్లు ఉన్న మ‌హిళ కుంభ‌మేళాకి సామాన్య స్త్రీ మాదిరిగా రావ‌డ‌మేంటి ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

775 Crore Assets : అన్నివేల కోట్లు ఉన్న మ‌హిళ కుంభ‌మేళాకి సామాన్య స్త్రీ మాదిరిగా రావ‌డ‌మేంటి ?

 Authored By ramu | The Telugu News | Updated on :22 January 2025,8:00 pm

ప్రధానాంశాలు:

  •  775 Crore Assets : అన్నివేల కోట్లు ఉన్న మ‌హిళ కుంభ‌మేళాకి సామాన్య స్త్రీ మాదిరిగా రావ‌డ‌మేంటి ?

775 Crore Assets : రాజ్యసభ సభ్యురాలు సుధా మూర్తి గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు.. సుధా మూర్తి తన సింప్లిసిటీకి, సామాజిక సేవతోనే పేరు తెచ్చుకున్నారు. ఇటీవల సుధా మూర్తి ఓ ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు. సుధా మూర్తి గత 30 ఏళ్లుగా చీర కొనలేదు. ఈ విషయాన్ని సుధా మూర్తి స్వయంగా చెప్పారు. అంతే కాదు దానికి కారణం ఏమిటో కూడా చెప్పారామె. సుధా మూర్తి విద్యావేత్త, రచయిత్రి మాత్రమే కాదు .. సేవా కార్యక్రమాలతో ఎంతో మందికి సహాయం చేస్తున్న మహిళామూర్తి. 2006లో సుధామూర్తికి పద్మశ్రీ పురస్కారం కూడా లభించింది. సుధా మూర్తి సింప్లిసిటీ అందరం చూశాం. తాజాగా ఆమె ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు సాధారణ మహిళగా వచ్చి, మరోసారి వార్తల్లో నిలిచారు.

775 Crore Assets అన్నివేల కోట్లు ఉన్న మ‌హిళ కుంభ‌మేళాకి సామాన్య స్త్రీ మాదిరిగా రావ‌డ‌మేంటి

775 Crore Assets : అన్నివేల కోట్లు ఉన్న మ‌హిళ కుంభ‌మేళాకి సామాన్య స్త్రీ మాదిరిగా రావ‌డ‌మేంటి ?

775 Crore Assets ద‌టీజ్ సుధా మూర్తి

ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్, 150కి పైగా ప్రచురిత పుస్తకాల రచయిత్రి సుధా మూర్తి చాలా మంది అమ్మాయిలను ఇంజినీరింగ్‌లో రాణించేలా ప్రేరేపించారు. తాజాగా సుధా మూర్తి కుంభ‌మేళాలో ప్ర‌త్య‌క్షం అయ్యారు. కుంభమేళాకు వచ్చిన సుధా మూర్తి ఒక చిన్న బ్యాగ్‌ మాత్రమే తీసుకెళ్తూ కనిపించారు. అది కూడా భుజానికి తగిలించుకునేది. ఎలాంటి హడావుడి లేకుండా ఆమె అందరిలో ఒకరిలా కుంభమేళాలు వచ్చి పుణ్యస్నానం చేశారు. ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ రంగంలో దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్‌కి ఆమె అసోసియేట్ అయినప్పటికీ సామాజిక సేవలో రచయిత్రిగా ఆమె సాధించిన విజయాలు అసమానమైనవి. ప్ర‌స్తుతం సుధామూర్తి సింప్లిసిటీకి సంబంధించి న‌లుగురు మెచ్చుకుంటున్నారు.

ధనమే సర్వస్వం కాదని, జీవితంలో ఆదర్శాలు, సరళత, సహాయమే శాశ్వతమని నమ్మిన వారు సుధామూర్తి. ఈ సింప్లిసిటీ వల్లనే ఇప్పటికీ సుధా మూర్తిని జనాలు ప్రత్యేకంగా చర్చించుకుంటారు. ముఖ్యంగా సుధా మూర్తికి షాపింగ్ అంటే చాలా ఇష్టం. నాకు చీర అంటే చాలా ఇష్టం. అయితే ఇప్పుడు చీర కొనకుండానే దాదాపు 3 దశాబ్దాలు గడిచిపోయాయి.అంటే 30ఏళ్లు గడిచాయని చెప్పారు. కోట్ల ఆస్తి ఉన్నప్పటికీ సుధా మూర్తి ప్రస్తుతం సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు.కారణం ఏంటి? సుధా మూర్తికి సనాతన ధర్మంపై నమ్మకం ఎక్కువ. ఈ నమ్మకమే సుధా మూర్తి నేటికీ చీర కొనకపోవడానికి కారణం.సుధా మూర్తి ఒకసారి పవిత్ర కాశీని సందర్శించారు. అక్కడ విశ్వాసాల ప్రకారం అక్కడికి వెళ్ళేవారు తమకు ఇష్టమైన ఒక వస్తువును వదిలివేయాలి. అలాగే సుధా మూర్తికి చీరలంటే ఇష్టం. నేటికీ ఆ తర్వాత సుధా మూర్తి చీరలు కొనుక్కోవడం ఆపేశారు.

Advertisement
WhatsApp Group Join Now

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది