Pastor Pagadala Praveen : పాస్టర్‌ పగడాల ప్రవీణ్‌ మృతిలో భారీ ట్విస్ట్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pastor Pagadala Praveen : పాస్టర్‌ పగడాల ప్రవీణ్‌ మృతిలో భారీ ట్విస్ట్..!

 Authored By ramu | The Telugu News | Updated on :31 March 2025,8:00 pm

ప్రధానాంశాలు:

  •  Pastor Pagadala Praveen : పాస్టర్‌ పగడాల ప్రవీణ్‌ మృతిలో భారీ ట్విస్ట్..!

Pastor Pagadala Praveen : పాస్టర్ పగడాల ప్రవీణ్ అనుమానాస్పద మృతి కేసులో రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఈ ఘటనపై పోలీసులు లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు. ప్రవీణ్ మరణానికి ముందు జరిగిన సంఘటనలను విశ్లేషించేందుకు సాంకేతిక ఆధారాలను ఉపయోగిస్తున్నారు. సీసీ కెమెరాల ఫుటేజ్‌ ద్వారా ఆయన ప్రతి కదలికను గుర్తిస్తూ, ఘటనకు సంబంధించిన అసలు విషయాలను వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి బయలుదేరిన ప్రవీణ్, రాజమహేంద్రవరం చేరుకునేలోపే అనేక చోట్ల ఆగి ఉండటం, మధ్యలో మద్యం కొనుగోలు చేయడం వంటి అంశాలు పోలీసులు సేకరించిన ఫుటేజ్‌ ద్వారా నిర్ధారణ అయ్యాయి.

Pastor Pagadala Praveen పాస్టర్‌ పగడాల ప్రవీణ్‌ మృతిలో భారీ ట్విస్ట్

Pastor Pagadala Praveen : పాస్టర్‌ పగడాల ప్రవీణ్‌ మృతిలో భారీ ట్విస్ట్..!

Pastor Pagadala Praveen పాస్టర్‌ పగడాల ప్రవీణ్‌ మృతికి సంబదించిన కీలక విషయాలు లీక్

పోలీసులు వెలికితీసిన వివరాల ప్రకారం.. ప్రవీణ్‌ 24వ తేదీ ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం కోదాడలో మద్యం కొనుగోలు చేశారు. ఆపై కంచికర్ల పరిటాల మధ్య ఆయన బుల్లెట్ అదుపుతప్పి కిందపడిపోవడంతో బైక్ ముందు భాగం దెబ్బతిన్నట్లు గుర్తించారు. గాయాలైనప్పటికీ, గొల్లపూడి చేరుకుని పెట్రోలు బంక్ వద్ద నిలిచి, అక్కడ సిబ్బందితో కొంతసేపు మాట్లాడినట్లు సమాచారం. అలాగే రామవరప్పాడు రింగ్ దగ్గర ప్రయాణిస్తున్న సమయంలో బైక్‌ నుంచి పడిపోవడం, పోలీసులు ఆయనను పైకెత్తి రెయిలింగ్‌ వద్ద కూర్చోబెట్టడం, అనంతరం గడ్డిలో విశ్రాంతి తీసుకోవడం వంటి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఈ కేసులో సుమారు 200 సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పోలీసులు జల్లెడ పట్టారు. ప్రవీణ్ చివరిసారిగా ఎక్కడ కనిపించాడనే అంశంపై పూర్తి దృష్టి సారించారు. ట్రాఫిక్ ఎస్‌ఐ అతన్ని ఆపే ప్రయత్నం చేసినా, ప్రవీణ్ ఆగకుండా ప్రయాణం కొనసాగించాడని పోలీసులు పేర్కొన్నారు. చివరగా రామవరప్పాడు రింగ్ దగ్గర రాత్రి 8.47 గంటలకు ఏలూరు వైపు వెళ్లినట్లు సీసీటీవీ ఆధారంగా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఈ ఆధారాల ఆధారంగా పోలీసులు మరింత లోతుగా విచారణ చేపడుతున్నారు. ప్రవీణ్ మరణానికి అసలు కారణం ఏమిటన్న దానిపై స్పష్టత వచ్చేలా విచారణ కొనసాగుతోంది.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది