Allu Arjun : గత కొద్ది రోజులుగా అల్లు అర్జున్ సెంట్రాఫ్ అట్రాక్షన్ అవుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. పుష్ప2లో ముఖ్య మంత్రి పక్కన ఫోటో దిగడానికి ఒప్పుకోలేదని.. అల్లు అర్జున్ తనకున్న డబ్బు బలంతో ఏకంగా ముఖ్యమంత్రిని మార్చేస్తాడు. ఇది రీల్ లైఫ్‌లో జరిగింది. రియల్ లైఫ్‌లో మాత్రం అలా లేదు. అతనిని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కేలా చేశాయి. కోర్టు గడప తొక్కేలా చేశాయి. చివరికి జైల్లో కొన్ని గంటలసేపు ఉండేలా చేశాయి. సంధ్య థియేటర్ ఉదంతం ముగిసింది అనుకుంటున్న తరుణంలో.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో ఈ విషయంపై ప్రముఖంగా ప్రస్తావించారు. తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. అల్లు అర్జున్ వ్యవహార శైలిని ఆయన తప్పు పట్టారు. అంతేకాదు సినిమా పరిశ్రమ లోని వ్యక్తుల తీరును ఆయన ఎండగట్టారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో మాట్లాడిన అనంతరం.. అల్లు అర్జున్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దీంతో ఒక్కసారిగా ఈ వ్యవహారం రచ్చ రచ్చ అయింది. ఈ వ్యవహారంలో హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తుండే శ్రీనివాస్ రెడ్డి పాదూరి సంచలన వ్యాఖ్యలు చేశారు.. పుష్ప సినిమా మాదిరిగానే తెలంగాణలోనూ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చి వేయడానికి కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు.. అల్లు అర్జున్ ను ఓ మహా శక్తి నడిపిస్తోందని.. అందువల్లే ఈ కేసు రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా, దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోందని ఆయన అన్నారు. ఇంతకీ ఆ మహా శక్తి ఎవరు అనే విషయాన్ని శ్రీనివాస్ రెడ్డి వెల్లడించలేకపోయారు.
శ్రీనివాస్ రెడ్డి చెప్పినట్టుగానే అల్లు అర్జున్ వెనుక ఆ అదృశ్య శక్తి ఉంటే ఆ అదృశ్య శక్తికి సీఎం అయ్యే ఛాన్స్ ఉంటుందా. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో ఒకరు సీఎం అవుతారు. అయిన రేవంత్ తన పదవిని అంత ఈజీగా వదిలి పెట్టరు. అతనికి భట్టి విక్రమార్క సహకరిస్తున్నాడు. ఉత్తంకుమార్ రెడ్డి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి భుజం తడుముతున్నాడు. దుద్దిల్ల శ్రీధర్ బాబు సాయపడుతున్నాడు.. పైగా రాహుల్ గాంధీ మొదటి నుంచి రేవంత్ రెడ్డికి సపోర్ట్ ఇస్తున్నాడు. అలాంటప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పటికిప్పుడు దిగిపోయే ప్రమాదం ఏముంది. ఇప్పటికైతే రేవంత్ రెడ్డికి ఎలాంటి ఇబ్బందులు లేవు. ఆయన సీఎం పదవి నుండి తొలగిన వ్యవసాయ క్షేత్రంలో ఉన్న వ్యక్తికి సీఎం అయ్యే ఛాన్స్ లేదంటున్నారు.
Allu Arjun : సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన విషయంలో అల్లు అర్జున్ ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో మనం చూస్తూనే…
Ap Intermediate 2025 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్ధులు 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్న…
Zodiac Signs : రానున్న సంవత్సరంలో ముఖ్యంగా జనవరిలో గ్రహాల రవాణా అన్ని రాశుల వారి జీవితాలు పైన ప్రభావాన్ని…
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ లుక్స్ చూసి మెగా ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. చిరు కూల్ లుక్ తో…
Krithi Shetty : ఉప్పెన భామ కృతి శెట్టి సినిమాల వేగం తగ్గింది. మొదటి సినిమా బ్లాక్ బస్టర్ అవ్వగానే…
Mohan Babu : తన ఫ్యామిలీతో జరుగుతున్న గొడవల్లో భాగంగా రిపోర్టర్ చెవికి గాయాన్ని చేశారు హీరో మంచు మోహన్…
Jr NTR : ఎన్ టీ ఆర్ ఫ్యాన్ కౌశిక్ కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఆ టైం లో…
Health Benefits : 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా మీలో ఆ స్టామినా మెయింటెనెన్స్ చేయడానికి కొన్ని ఆహారాలు…
This website uses cookies.