Amaravati : అమ‌రావ‌తి కేంద్రంగా కీల‌క నిర్ణ‌యం.. ఇది గేమ్ ఛేంజ‌ర్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Amaravati : అమ‌రావ‌తి కేంద్రంగా కీల‌క నిర్ణ‌యం.. ఇది గేమ్ ఛేంజ‌ర్

 Authored By ramu | The Telugu News | Updated on :15 March 2025,5:00 pm

ప్రధానాంశాలు:

  •  Amaravati : అమ‌రావ‌తి కేంద్రంగా కీల‌క నిర్ణ‌యం.. ఇది గేమ్ ఛేంజ‌ర్

Amaravati : ఏపీ రాజధాని అమరావతి కేంద్రంగా కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం కొత్త రాజధాని అమరావతి విషయంలో వ్యూహాత్మక నిర్ణయాలు అమలు చేస్తోంది. ఇప్పటి వరకు ఆర్దిక వనరుల సమీకరణ పైన ఫోకస్ చేసిన కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు నిర్మాణాల పైన కసరత్తు చేస్తోంది. కూటమి ప్రభుత్వం కొత్త రాజధాని అమరావతి విషయంలో వ్యూహాత్మక నిర్ణయాలు అమలు చేస్తోంది.

Amaravati అమ‌రావ‌తి కేంద్రంగా కీల‌క నిర్ణ‌యం ఇది గేమ్ ఛేంజ‌ర్

Amaravati : అమ‌రావ‌తి కేంద్రంగా కీల‌క నిర్ణ‌యం.. ఇది గేమ్ ఛేంజ‌ర్

Amaravati కీల‌క నిర్ణయం..

ఇప్పటి వరకు ఆర్దిక వనరుల సమీకరణ పైన ఫోకస్ చేసిన కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు నిర్మాణాల పైన కసరత్తు చేస్తోంది. పలు నిర్మాణాలకు టెండర్లు ఖరారు చేసింది. ఇక, కీలకమైన ఐకానిక్ టవర్స్ టెండర్లు పిలిచేందుకు సిద్దమైంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా అమరావతి నిర్మాణ పనులు ప్రారంభిం చాలని ప్రభుత్వం నిర్ణయించింది. నెలాఖరులో ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు.. ప్రధానితో భేటీ అయి అమరావతికి ఆహ్వానించనున్నారు. అమరావతి పనుల ప్రారంభ ఘట్టం అట్టహాసంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.

అమరావతి ప్రభుత్వ సముదాయంలోనే అత్యంత కీలకమైన ఐకానిక్‌ టవర్లకు వచ్చే వారం టెండర్లు పిలవాలని భావిస్తున్నారు. ఐదు టవర్ల నిర్మాణానికి ప్రస్తుత ధరల మేరకు రూ. 4,687 కోట్ల వ్యయానికి ప్రభుత్వం పాలనాపరంగా ఆమోదించింది. గతంలోలాగే ఈసారి కూడా మూడు ప్యాకేజీలుగా టెండర్లు పిలవనున్నారు. రాజధానిలో సువిశాలమైన రహదారులు నిర్మానం చేసి చైన్నై-కోల్‌కతా హైవేతో పాటు ఇన్నర్‌ రింగ్‌ రోడ్డుకు అనుసంధానించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డుకు రాజధానిలోని అన్ని ప్రధాన రోడ్లను అనుసంధానించేలా డీపీఆర్‌ రూపొందిస్తున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది