Ambati Rambabu : నీది ఒక మ్యానిఫెస్టోనా.. చంద్రబాబుపై అంబటి మరోసారి ఫైర్.. దారుణంగా తిట్టేశాడు బాబోయ్

Authored By Breaking News 2 | The Telugu News | Published on: November 19, 2023, 9:00 pm
  •  2014 ఎన్నికల్లో అబద్ధపు హామీలు చెప్పిన చంద్రబాబు

  •  420వి అంటూ అంబటి రాంబాబు చంద్రబాబుపై మండిపడ్డారు

  •  నువ్వు గొప్ప పాలన చేస్తావని ప్రజలు అనుకున్నారా?

Ambati Rambabu : ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా వచ్చే ఎన్నికలకు పార్టీలన్నీ సమాయత్తం అవడమే కనిపిస్తోంది. ఎన్నికలకు ఇంకా 5 నెలలు ఉన్నా కూడా ఇప్పటి నుంచే ఎన్నికలకు ప్రధాన పార్టీలన్నీ సంసిద్ధం అవుతున్నాయి. ఇప్పుడే మేనిఫెస్టోలను కూడా ప్రకటించేస్తున్నాయి పార్టీలు. అసలు ఆలు లేదు.. చూలు లేదు.. అన్న చందంగా ముందే మేనిఫెస్టోలు, ఎన్నికల ప్రచారాలు, ఎన్నికల్లో పొత్తులు, అభ్యర్థుల ఎంపిక అన్నింటిపై కసరత్తును ప్రారంభించాయి పార్టీలు. తాజాగా ఏపీ మంత్రి అంబటి రాంబాబు టీడీపీ అధినేత చంద్రబాబుపై విరుచుపడ్డారు. 2014 ఎన్నికల్లో అబద్ధపు హామీలు చెప్పి, మోసపూరిత మేనిఫెస్టోను ప్రకటించి ఏపీ ప్రజలను మోసం చేశారని అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు. మహానాడు వేదిక మీదుగా మేనిఫెస్టోను రిలీజ్ చేసి మేనిఫెస్టోలో అద్భుతమైన వాగ్దానాలు చేశారు. నన్ను అధికారంలోకి తీసుకురండి అన్నాడు. అమ్మకు వందనం ఇస్తా అన్నాడు. ప్రతి మహిళకు 1500 ఇస్తా అన్నాడు. మహిళలకు 3 సిలిండర్లు ఇస్తా అన్నాడు. రైతులకు రూ.20 వేలు ఇస్తాడట.. చాలా వాగ్దానాలు చేశాడు అంటూ అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు.

యువగళంలో నారా లోకేష్ నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. అసలు ఇచ్చిన వాగ్దానాల్లో ఏదైనా ఒక్క వాగ్దానం అయినా అమలు చేశావా నీ జన్మ మొత్తంలో. రైతులకు రుణమాఫీ చేసిన ప్రభుత్వం అంటూ చెప్పుకొస్తారు ఏమైనా అంటే.. ఏం రుణమాఫీ చేశారు రైతులకు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అన్నావు. ఇన్ స్టాల్ మెంట్స్ అన్నావు. డ్వాక్రా మహిళలకు రుణ మాఫీ అన్నావు. ఏమైనా చేశావా? అదేంటి అని విలేఖరులు అడిగితే.. ఏమండి రుణమాఫీ చేశారా? అంటే చేశాం కదా రుణమాఫీ అన్నాడు. మొత్తం చేస్తామా.. మొత్తం చేస్తామని చెప్పామా.. ఊరుకో అన్నాడు. దబాయించాడు.. అంటూ చంద్రబాబుపై అంబటి రాంబాబు మండిపడ్డారు.

Ambati Rambabu : నువ్వు రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో ఒక్కటైనా అమలు చేశావా?

నువ్వు రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో ఒక్కటైనా అమలు చేశావా? నీతిగా, నియమంగా అమలు చేశావా? నిరుద్యోగ భృతి ఇస్తా అని ఇచ్చావా? మీరెవ్వరూ ఊహించని విధంగా పాలన చేస్తా.. అంటే నువ్వు గొప్ప పాలన చేస్తావని ప్రజలు అనుకున్నారా? వాగ్దానాల టోపీ పెట్టావు ప్రజలకు. ఎవరు నమ్ముతారు. ఇంత దుర్మార్గమైన ఆలోచన చేసే కార్యక్రమం. జగన్ మోహన్ రెడ్డి గారిని దించేయండి.. అంటూ నువ్వు దస్తాలకు దస్తాలు మేనిఫెస్టోలు చేసి ఒక్కటి అమలు చేయని చీటర్ వి, 420వి అంటూ అంబటి రాంబాబు చంద్రబాబుపై మండిపడ్డారు.

Breaking News 2

No bio available for this author.

  1. "November Box Office : నవంబర్ మూడో వారం బాక్సాఫీస్ వద్ద రక్తపాతం.. క్రేజీ సినిమాల మధ్య బిగ్ ఫైట్ ఫిక్స్..!"

  2. "Prabhas Imanvi : ప్రభాస్ నుంచి ‘ఫౌజీ’ హీరోయిన్ ఇమాన్వీకి బర్త్‌డే సర్‌ప్రైజ్.. ఇన్ని రకాల వంటకాలా..!"

  3. "Jailer 2 Movie First Review : జైలర్ మూవీ ఫ‌స్ట్ రివ్యూ..!"

  4. "Ysrcp : ఉన్నదే 11 సీట్లు.. బిల్డప్ మాత్రం మామూలుగా లేదుగా! వైసీపీ హైడ్రామాపై నెటిజన్ల సెటైర్లు.!"

  5. "AP Local Elections : మున్సిపల్ సీట్ల పంపకంలో కూటమి బిగ్ ట్విస్ట్.. నేడే తేల్చేయనున్న టీడీపీ-జనసేన-బీజేపీ..!"

  6. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  7. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp