Ambati Rambabu : ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా వచ్చే ఎన్నికలకు పార్టీలన్నీ సమాయత్తం అవడమే కనిపిస్తోంది. ఎన్నికలకు ఇంకా 5 నెలలు ఉన్నా కూడా ఇప్పటి నుంచే ఎన్నికలకు ప్రధాన పార్టీలన్నీ సంసిద్ధం అవుతున్నాయి. ఇప్పుడే మేనిఫెస్టోలను కూడా ప్రకటించేస్తున్నాయి పార్టీలు. అసలు ఆలు లేదు.. చూలు లేదు.. అన్న చందంగా ముందే మేనిఫెస్టోలు, ఎన్నికల ప్రచారాలు, ఎన్నికల్లో పొత్తులు, అభ్యర్థుల ఎంపిక అన్నింటిపై కసరత్తును ప్రారంభించాయి పార్టీలు. తాజాగా ఏపీ మంత్రి అంబటి రాంబాబు టీడీపీ అధినేత చంద్రబాబుపై విరుచుపడ్డారు. 2014 ఎన్నికల్లో అబద్ధపు హామీలు చెప్పి, మోసపూరిత మేనిఫెస్టోను ప్రకటించి ఏపీ ప్రజలను మోసం చేశారని అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు. మహానాడు వేదిక మీదుగా మేనిఫెస్టోను రిలీజ్ చేసి మేనిఫెస్టోలో అద్భుతమైన వాగ్దానాలు చేశారు. నన్ను అధికారంలోకి తీసుకురండి అన్నాడు. అమ్మకు వందనం ఇస్తా అన్నాడు. ప్రతి మహిళకు 1500 ఇస్తా అన్నాడు. మహిళలకు 3 సిలిండర్లు ఇస్తా అన్నాడు. రైతులకు రూ.20 వేలు ఇస్తాడట.. చాలా వాగ్దానాలు చేశాడు అంటూ అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు.
యువగళంలో నారా లోకేష్ నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. అసలు ఇచ్చిన వాగ్దానాల్లో ఏదైనా ఒక్క వాగ్దానం అయినా అమలు చేశావా నీ జన్మ మొత్తంలో. రైతులకు రుణమాఫీ చేసిన ప్రభుత్వం అంటూ చెప్పుకొస్తారు ఏమైనా అంటే.. ఏం రుణమాఫీ చేశారు రైతులకు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అన్నావు. ఇన్ స్టాల్ మెంట్స్ అన్నావు. డ్వాక్రా మహిళలకు రుణ మాఫీ అన్నావు. ఏమైనా చేశావా? అదేంటి అని విలేఖరులు అడిగితే.. ఏమండి రుణమాఫీ చేశారా? అంటే చేశాం కదా రుణమాఫీ అన్నాడు. మొత్తం చేస్తామా.. మొత్తం చేస్తామని చెప్పామా.. ఊరుకో అన్నాడు. దబాయించాడు.. అంటూ చంద్రబాబుపై అంబటి రాంబాబు మండిపడ్డారు.
నువ్వు రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో ఒక్కటైనా అమలు చేశావా? నీతిగా, నియమంగా అమలు చేశావా? నిరుద్యోగ భృతి ఇస్తా అని ఇచ్చావా? మీరెవ్వరూ ఊహించని విధంగా పాలన చేస్తా.. అంటే నువ్వు గొప్ప పాలన చేస్తావని ప్రజలు అనుకున్నారా? వాగ్దానాల టోపీ పెట్టావు ప్రజలకు. ఎవరు నమ్ముతారు. ఇంత దుర్మార్గమైన ఆలోచన చేసే కార్యక్రమం. జగన్ మోహన్ రెడ్డి గారిని దించేయండి.. అంటూ నువ్వు దస్తాలకు దస్తాలు మేనిఫెస్టోలు చేసి ఒక్కటి అమలు చేయని చీటర్ వి, 420వి అంటూ అంబటి రాంబాబు చంద్రబాబుపై మండిపడ్డారు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.